Tollywood news in telugu

లేడీ మెగాస్టార్ విజయ శాంతి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.

విజయ్ శాంతి…200లకు పైగా చిత్రాల్లో నటించిన కదానాయక…హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరు.. చిత్ర పరిశ్రమలో హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ను, అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నటి..విజయశాంతి.. ఇటీవలే చాలా రోజుల తర్వాత మళ్ళి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.. అయినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు అన్ని సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ ఏ చెబుతుంది… మరి ఈ అందాల తార గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం…

విజయశాంతి తన 14వ ఏటనే పలు చిత్రాల్లో బాలనటిగా తెరంగ్రేటం చేసింది… అప్పటి అగ్ర హీరోయిన్ విజయలలిత కి విజయశాంతి స్వయానా మేనకోడలు అవుతుంది…ఆమె కళుక్కుళ్ ఈరం తమిళ చిత్రంతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది… ఆ తర్వాత టాప్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ ల సరసన కూడా నటించింది… రాజేంద్ర ప్రసాద్ సరసన నటించిన “పెళ్లిచూపులు” చిత్రం విజయశాంతి జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా మిగిలిపోయింది..నేటి భరతం ఈ చిత్రంలో లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది… కర్తవ్యం చిత్రం అప్పట్లో భారీ హిట్ సాధించింది…. దీంతో భారతదేశమంతా విజయశాంతి పేరు మారు మోగిపోయింది… ఎంత అంటే అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి కి సమానంగా విజయశాంతి కూడా కోటిపైగానే రెమ్యూనరేషన్ తీసుకునేది… ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విజయశాంతి పొందని పురస్కారాలు, అవార్డులే లేవు.. ఫిలింఫేర్ నుండి జాతీయ అవార్డ్ ల వరకు అన్ని సొంతం చేసుకుంది..2006 వ సంవత్సరం “నాయుడమ్మ” సినిమా తర్వాత సినిమాలకు విజయశాంతి గుడ్ బాయ్ చెప్పి.. రాజకీయాల్లోకి ప్రవేశించింది….నిర్మాత ఏం శ్రీనివాస ప్రసాద్ ను 1988 వ వివాహం చూసుకుంది..వీరికి ఒక పాపా, బాబు ఉన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button