phone pe లో ఉద్యోగ ప్రకటన !

AP లోని నిరుద్యోగ యువతకు ఫోన్ పే మంచి శుభవార్తను తీసుకొచ్చింది. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరోసారి నిరుద్యోగుల కోసం ఉద్యోగ ప్రకటనను విడుదలచేసింది.
ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు జరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా మొత్తం 75 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది .
అయితే అభ్యర్థులు ద్విచక్రవాహనంతో పాటు, ఆండ్రాయిడ్ ఫోన్ తప్పక కలిగి ఉండాలని సూచించింది. ఈ పోస్టుకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఫోన్ పే
పోస్టు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.
విద్యార్హత: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ.
జీతం: 11,500+PF+ఇన్సూరెన్స్+ఇన్సెంటీవ్స్(రూ. 3000-రూ. 5,000).
అనుభవం: సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు అనుభవం ఉండాలి.
మొత్తం ఖాళీలు: 75.