Tollywood news in telugu

నేడు యేసు దాస్ గారి జన్మదినం

డెబ్భై తొమ్మిదో పడిలోకి అడుగు పెట్టిన యేసు దాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో..

ఆయన గురించి ఒక నాలుగు మాటలు తెలుసుకుందాం ఈ కథనంలో..భగవంతుని భూమిగా పెరుగాంచిన కేరళలొని కొచ్చిన్లో అతి సాధారణ డ్రామా కళాకారుల కుటుంబంలో జన్మించిన యేసు దాస్ మూడవ ఏట నుండే సంగీతం మీద పట్టు సాధించాడు.క్రిస్టియన్ అయినప్పటికి తన తండ్రి ప్రోత్సాహంతో కర్నాటక సంగీత పాఠాలు నేర్చుకున్నాడు.

యువకునిగా ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించి సంగీత కోర్స్ పూర్తిచేసి మొదటి పాటను సుప్రసిద్ద సంఘసంస్కర్త నారాయణ గురు రాసిన అద్భుత గీతంతో ఆయన సిని రంగ ప్రవేశం చెసారు.తరవాత తెలుగులో కోదండ పాణి ద్వారా,హింది లో సాలీళ్ చౌదరి ద్వారా దాదాపు అన్ని భాషల్లో సుమారు 50వేల పైబడి పాటలు పాడారు.అఫ్గనిస్తాన్,రష్యాల లో కూడా కరువు సమయం లో కచేరీలు చేసి విరాళాలు కలేక్ట్ చేసిన మంచి మనసున్న గాయకుడు.

తన గాత్రంలో జాతి మత కుల భేదాలు లేకుండా కొన్ని వందల అయ్యప్ప పాటలు,కొన్ని వేల హిందూ భక్తి గీతాలు పాడారు.భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషన్ తో సత్కారము చేసింది.తన అభిమాని అయిన ప్రభ తో వివాహం జరిగింది ఆయనకు ముగ్గురు సంతానము.అత్యుత్తమ గాయకులు కూడా ఆయన అభిమానులు.చిత్ర,ఉన్ని క్రిష్ణన్,ఉన్ని మీనన్ వంటి వర్ధమాన గాయకులు ఆయన సంస్థ తరంగిణి లో శిక్షణ పొందిన వారే…

Tags

2 Comments

  1. Everyday someone’s birthday will come. What is so great in it. Don’t waste your and others time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button