telugu facts

కేవ‌లం 60 సెకండ్ల‌లోనే మీరు నిద్ర‌లోకి వెళ్ళే ట్రిక్… ట్రై చేయండి

మనిషి జీవితంలో ఆహారం, నీరు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలుసు. వాటితో పాటు అంతే ముఖ్యమైనది నిద్ర. కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి తన రోజువారీ కార్యకలాపాలు ఏవి సరిగా చేయలేడు. అయితే నేటి ఆధునిక ప్ర‌పంచంలో మనమంతా చాలా వరకు అనేక సంద‌ర్భాల్లో ఒత్తిళ్ల‌కు, ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతుంటాము. నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌డంతో ఎక్కువ సేపు మెళ‌కువ‌గా ఉండి ఎప్పుడో అర్థ‌రాత్రి ప‌డుకుని ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తోంది. దీనినే నిద్రలేమి అoటారు. చాలా మంది తమకు నిద్ర పట్టడానికి చాలా రకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఇయర్ ప్లగ్స్, కంటికి మాస్క్ వేసుకోవడం, నిద్రమాత్రలు లాంటివి అన్ని నిద్రలో జారుకోవడానికి సహాయపడటానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నవి మరియు నిద్ర లేమికి ఇవన్నీ కూడా స్వల్పకాలిక పరిష్కారాలను మాత్రమే అందిస్తాయి మరియు నిద్ర లేమి అనేది మంచి విశ్రాంతికి అంతరాయం కలిగించవచ్చు.

మరి మంచి నిద్ర కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయిoచకుండా కేవలం మనం తీసుకునే శ్వాస మీద దృష్టిని పెడితే చాలు. మంచి నిద్రను పొందడం ఎంత సులభం అంటే ఊపిరి తీసుకోవడం మరియు ఊపిరి వదలడం అంత ఈజీ అని ప్రముఖ వైద్యులు చెపుతున్నారు. దీని కోసం ఒక సింపుల్ టెక్నిక్ ని ఇప్పుడు మనం చూద్దాం. అదే 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజు” దీనినే “ది రిలాక్సింగ్ బ్రీత్” అని కూడా పిలుస్తారు, ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది మన ప్రాణాయామం మీద ఆధారపడి ఉంటుంది, ఇది ఒక రకమైన పురాతన “శ్వాస నియంత్రణ” అని అర్ధం. ఇది “నాడీవ్యవస్థకు ఒక సహజమైన మత్తు మందు లాగా” పని చేస్తుంది. అది శరీరాన్ని ప్రశాంతతగా మారుస్తుంది.

“4-7-8” బ్రీతింగ్ ఎక్సర్సైజు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం:

ఈ ఎక్సర్సైజుని ఏ సమయంలోనైనా, మరియు ఐదు స్టెప్స్ లో ఎక్కడైనా చేయవచ్చు. మీరు ఈ వ్యాయామాన్ని ఏ స్థితిలోనైనా చేయవచ్చు. కాని మీరు ఈ వ్యాయామం నేర్చుకునేటప్పుడు మీ వెనుక భాగం స్ట్రెయిట్ గా ఉండేలా కూర్చోవాలి. మొదట నాలుక‌ను నోటి లోప‌ల పై భాగాన్ని ట‌చ్ చేసేలా ఉంచాలి. అలా ఉంచాక 4 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌లికి ముక్కు ద్వారా పీల్చాలి. ఆ తరువాత 7 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను మొత్తాన్ని నోటి ద్వారా బ‌య‌ట‌కు పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 4 సార్లు చేయాలి. ఈ ట్రిక్ ని రెండు నెలల పాటు రోజుకి రెండు సార్లు ఇలా చేయడం ద్వారా మీరు ఈ ఎక్సర్సైజు చేయడంలో పర్ఫెక్ట్ అయిపోతారు. దీని వ‌ల్ల మీరు మీలో కలిగే ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడతారు. ఈ మార్పును మీరు గ‌మ‌నిస్తారు. ఈ ట్రిక్ ద్వారా మీరు ఒకసారి ప‌డుకున్నాక సులువుగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని వెంట‌నే నిద్రలోకి జారుకుంటారు. మరి ఈ టెక్నిక్ ని మీరు కూడా ప్రయత్నంచి చూడండి.

 

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button