telugu facts
కోట్ల ఆస్తులు వదులుకున్న కూతుర్లు…ఎందుకిలా చేసారో !

ఒక ముసలావిడ తన చివరికోరికమేరకు ఈమె కూతుర్లు కోట్ల రూపాయలు వదులుకున్నారు. వీటితోపాటు వారి తల్లి ఆభరణాలు కూడా విరాళంగా ఇచ్చేసారు.
వివరాల్లోకి వెళితే… ఒడిశా లోని నవరాంగౌర్ కి చెందిన ఒక మహిళా ఉండేది, ఈమెకు 25 గదులతో కూడిన ఒక 3 అంతస్తుల భవంతి , అలాగే ఈమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికీ పెళ్లిళ్లు చేసి కాపురాలు పంపించేసింది.

కానీ ఈ మహిళా మొన్న డిసెంబరు 2న కొన్ని అనారోగ్య సమస్యలతో చనిపోయింది. ఈ చనిపోయిన మహిళాపేరు వైజయంతిమాలా ఈమె చనిపోతూ తన చివరి కోరికగా తన కొడుకుగా భావించే జగన్నాథునికి తన ఆస్థిని మొత్తం విరాళంగా ఇవ్వాలని కోరింది.

తన చివరి కోరిక మేరకు ఆ ముగ్గురు కూతుర్లు వైజయంతిమాలా ఆస్థిని మొత్తం విరాళంగా సమర్పించారు. ఈ రోజుల్లో ఆస్తులకోసం కొట్లాడుకునే వారినిచూశాం గాని ఇలా ఆస్తులను విరాళంగా రాసివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది.