health tips in telugu

hair loss remedies : జుట్టు రాలిపోతోందా.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా అయితే ఇది మీకోసమే..

hair loss remedies మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జింక్‌ లోప సమస్యను సాధారణంగా గుర్తించలేము. మన రోజూవారీ ఆహారంలో జింక్‌ సమృద్ధిగా అందదు. వెజిటేరియన్‌ ఎక్కువగా తీసుకునే వారిలో జింక్‌ లోపం కనిపిస్తూ ఉంటుంది.

జింక్‌లోపం ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్‌ ఫాల్‌ అధికంగా ఉంటుంది. చుండ్రు సమస్యతోపాటు కొన్ని రకాల చర్మ వ్యాధులు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లల్లో శారీరక ఎదుగుదల లేకపోవడం, బలహీనంగా ఉండటం, కంటి చూపు తగ్గడం జరుగుతుంది.

జింక్‌ లోపం వలన పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా మధుమేహం, కాలేయ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, శరీరం దుర్వాసన రావడం, నిద్రలేమి, శృంగార శక్తి తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.

జింక్‌ లోపంతో బాధపడేవారికి నువ్వులు చాలా మేలును చేస్తాయి. మిగతా ధాన్యాలతో పోలిస్తే ఇందులో జింక్‌ అధికంగా ఉంటుంది.

రెడ్‌మీట్‌, ముఖ్యంగా గొర్రె, బీఫ్‌ మాంసంలో జింక్‌ చాలా అధికంగా ఉంటుంది. పురుషుల్లో వచ్చే టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల సమస్యను అధిగమించాలన్నా, ఎక్కువ మొత్తంలో పోషకాలు పొందాలంటే మగవారు రెడ్‌మీట్‌ను తినాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button