Tollywood news in telugu

హీరో అబ్బాస్ ఇప్పుడు చేసే పని తెలిస్తే మీరు తట్టుకోలేరు…!

if you knew what Hero Abbas is doing now

టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకొని, ఇపుడు కనిపించకుండా పోయాడు అబ్బాస్. ఇలా అబ్బాస్ అనేకాదు చాలామంది హీరోహీరోయిన్లు కొంతకాలం సినీ ఇండస్టీలో కొనసాగి , అవకాశాలు రాకనో, లేదంటే వారికీ నటించే జీవితం నచ్చకనో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ప్రతీ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూఉంటుంది.

అప్పట్లో తమిళ్ దర్శకుడు కాతిర్ తెరకెక్కించిన ‘ ప్రేమ దేశం’ సినిమా లో అబ్బాస్ హీరోగా నటించిన, ఈ సినిమా ద్వారా  యూత్ లో  మరియు లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలా అప్పుడు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.  ఈ సినిమా పెద్ద హిట్ కూడా సాధించింది.

ఇక ఈ సినిమా తరువాత అడపాదడపా రెండు,మూడు సినిమాలు వచ్చినప్పటికీ అవి అతగా ఆడలేదు. దీనితో అమాంతం అబ్బాస్ మార్కెట్ పడిపోయింది. ఇలా నిర్మాతలు , దర్శకులు అబ్బాస్ వైపు చూడటం మానేశారు. తరవాత వరుసగా  రజినీకాంత్,కమల్ హాసన్, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోల పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి , కొన్నిరోజులు ఇండస్ట్రీలో కొనసాగాడు. తరవాత ఏమైందో ఏమో సడన్ గా ‘హార్పిక్ ‘ ఆడ్ లో నటించి చివరికి తెరపై కనిపించకుండా పోయాడు.

అలా సినిమాలకు దూరం ఐన అబ్బాస్ ఇపుడు ఇండియా ను వదిలేసి, న్యూజిలాండ్ లో   సెటిలయ్యారు. అక్కడకూడా అబ్బాస్ ని కష్టాలు వెంటాడాయి. పెళ్లి చేసుకొని న్యూజిలాండ్ లో మంచి ఇల్లు తీసుకున్న కూడా పాపం ఆయన అక్కడ వృత్తి కోసం సామాన్య మనిషిలాగానే కష్టపడాల్సి వచ్చింది. డబ్బుకోసం  న్యూజిలాండ్ లో పెట్రోల్ బంక్ లో కూడా ఎన్నో సంవత్సరాలు పని చేసాడు అబ్బాస్, ఈ విషయం తెలుసుకున్న ప్రతిఒక్కరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆ దేశంకాని దేశంలో బ్రతకాలంటే ఏదోఒక పనిచేయక తప్పదు. ఆలా అని అక్కడ ప్రతి వృతి వారిని అక్కడి ప్రజలు గౌరవిస్తారు. ఇలా అబ్బాస్ కష్టాలు పడుతూనే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి అడుగు పెట్టి అనతి కాలం లోనే న్యూజిలాండ్ లో టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ లో ఒక్కడిగా ఎదిగాడు.

ఇలా రంగుల ప్రపంచం నుండి బయటికివచ్చి కష్టాలు పడి , తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరో దారి వెతుక్కొని నిలదొక్కుకున్న అబ్బాస్ జీవితం చుస్తే , తనని ఆదర్శంగా తీసుకోవచ్చు అనిపిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button