Political News
రోజా తన అభిమాన నాయకుడు పేరు మీద ఏంచేసిందో … తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒక అనాధ బాలికను దత్తత చేసుకొని తనని చదివించే బాధ్యతను తీసుకుంది. సీఎం పుట్టిన రోజు సందర్భంగా రోజా తన ఉదార హృదయం తో ఈ మంచి పని చేసింది. నేను చేసిన పనికి జగన్ అన్న ఎంతగానో సంతోషించారని రోజా తెలియజేసారు.
అలాగే దత్తత తీసుకున్న చిన్నారి గురించిన వీడియోను చూపించి జగన్ అన్న కి వివరంగా చెప్పానని తన అభిమాన నాయకుడి పేరు మీద చిన్నారి బాగోగులు చూసుకుంటున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
‘పుష్పకుమారి’ అనే అమ్మాయి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న రోజా ఆమెను దత్తత తీసుకొని తాను ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివిపిస్తానని రోజా వెల్లడించింది. జగన్ అన్న ఎంతోమంది చిన్నారులకు మేనమామలా మారారని తెలిపింది.