News
యశోద ఆస్పత్రులలో… యాజమాన్య ఇళ్లల్లో ఐటీ సోదాలు !

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలోని యశోద ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆస్పత్రికి సంబందించిన కొంతమంది సీనియర్ డాక్టర్ల ఇళ్లలోనూ తనికీలు జరుగుతున్నాయి. డాక్టర్ల ఐటీ చెల్లింపుల వ్యవహారంలో అనుమానం రావడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. ఒకేసారి 20 బృందాలతో కూడి సోదాలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలుస్తుంది. ఈ సోదాలవల్ల మిగితా కార్పొరేట్ ఆస్పత్రులు అప్రమత్తమైనట్టు సమాచారం.