ఇండియన్ మార్కెట్ లోకి రాబోతున్న జియోమి Mi A2
Xiaomi Mi A2 భారతదేశం లో ఆగష్టు 8 వ తేది నుండి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని అధికారికంగా జూలై 24 వ తేది ఒక ఈవెంట్ లో ప్రారంభించారు. ఇది అమెజాన్ ఇండియా ఆన్ లైన్ లో ప్రత్యేకంగా రాబోతుంది. Xiaomi Mi A2 లాంచింగ్ ఇండియాలో చేయబోతున్నట్లు ట్విటర్ లో Xiaomi India కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ నిర్ధారించారు.
తరువాతి రెండు సంవత్సరాల్లో సాధారణ సాఫ్ట్ వేర్ అప్డేట్స్ తో Xiaomi Mi A2 ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్ తో వస్తుంది. ఫోన్ Android 8.1 Oreo యొక్క స్టాక్ వర్షన్ తో నడుస్తుంది. భారతదేశంలో ప్రత్యేకంగా క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 4.0 కి Mi A2 సపోర్ట్ చేస్తుందని Xiaomi నిర్ధారించింది. యూరోప్ మరియు ఇతర మార్కెట్లలో Xiaomi Mi A2 క్విక్ ఛార్జర్ 3.0 కు మద్దతు ఇస్తుంది. ఇది ఇండియాలో భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని Mi A2 ధర రూ .20,000 కు దగ్గరగా ఉంటుంది. Mi A2 మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది: నలుపు, గోల్డ్ మరియు బ్లూ.
జూలై 24 న మాడ్రిడ్ లో జరిగిన కార్యక్రమంలో Xiaomi Mi A2 మరియు Mi A2 లైట్ ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు Mi A2 లైట్ భారతీయ మార్కెట్లోకి రావడం లేదని Xiaomi చెప్పింది. Mi A2 మూడు రకాల స్టోరేజ్ లలో అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది కేవలం 4GB RAM మరియు 64GB స్టోరేజ్ మోడల్ మాత్రమే కనిపిస్తుంది. అయితే, మరింత తెలుసుకోవాలoటే ఈ ప్రోడక్ట్ కోసం వెయిట్ చేయాలి. 4GB RAM/32GB మెమరీ, 4GB RAM/64GB మెమరీ, మరియు 6GB RAM/128GB మెమరీ – Xiaomi Mi A2 మూడు రకాల స్టోరేజ్ లలో స్పెయిన్ లో ప్రారంభించబడింది.
Xiaomi Mi A2 5.99 అంగుళాల FHD+ 18: 9 యొక్క స్క్రీన్ యాస్పెక్ట్ రేషియోతో ఉన్న డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో పొందవచ్చు. ఇది ఒక మెటల్ యూనిబాడీ డిజైన్ మరియు ఒక 2.5D కర్వ్ గ్లాస్ తో డిస్ప్లే కవర్ చేయబడి ఉంటుoది. Mi A2 స్నాప్ డ్రాగెన్ 660 ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంది మరియు ఇది 3010 mAh బ్యాటరీతో సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ప్రతి సెన్సార్ f /1.75 అపేర్చ్యుర్ కలిగి ఉన్న 12MP + 20MP డ్యూయల్ –రియర్ కెమెరాలతో వస్తుంది. ఇది ఒక 20MP సెల్ఫీ కెమెరాతో AI పోర్ట్రైట్ మోడ్ తో వస్తుంది.