Mi Air Charge: గాల్లోనే ఫోన్ ఛార్జింగ్..మార్కెట్ లోకి కొత్త టెక్నాలజీ..

Mi Air Charge: మొదట మన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఐదారు గంటలు పట్టేది. ఆ తర్వాత ఆయా సంస్థలు ఫాస్ట్ చార్జర్ లని అందుబాటులోకి తేవడంతో గంటలోపే 80% బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. తాజాగా మరో కొత్త టెక్నాలజీ కి షావోమి కంపెనీ శ్రీకారం చుట్టింది. ఎలాంటి కేబుల్స్, ఛార్జింగ్ స్టాండ్ అవసరం లేకుండా.. వైర్లెస్ ఛార్జింగ్ ని అందుబాటులోకి తేనుంది.
ఇది ఎయిర్ ఛార్జింగ్ టెక్నాలజీతో రిమోట్ ఛార్జర్ ద్వారా మొబైల్ కి ఛార్జ్ అవుతుంది . దీని ద్వారా మనం ఏ కేబుల్ మొబైల్ కనెక్ట్ చేయకుండా.. చార్జింగ్ ఎక్కించగలం.. అలాగే రిమోట్ చార్జర్ కి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్లను కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.. కానీ ఈ ఎయిర్ చార్జింగ్ అనేది నాలుగు సెంటీమీటర్లు పరిధి లో ఉంటేనే పనిచేస్తుంది
ప్రస్తుతం ఈ చార్జర్ పరిశోధన దశలోనే ఉందన్ని.. త్వరలో అన్ని దేశాల ప్రభుత్వాల అనుమతులు పొంది… మార్కెట్లోకి ప్రవేశపెడతామని షావోమి కంపెనీ ప్రకటించింది.