News
విశాఖలో దారుణం ప్రాణాపాయ స్థితిలో మహిళ !

ఈ దారుణమైన ఘటన విశాఖపట్నం జిల్లా లో జరిగింది. కేవలం ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఒక భర్త ఇంత నీచానికి ఒడిగట్టాడు.
వివలల్లోకి వెళ్తే … అపర్ణ అనే ఒక మహిళా గంగు నాయుడు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి పెళ్లి 2016 లో జరిగింది. నాయుడు ఎప్పుడు అపర్ణతో మనకు మొదట అబ్బాయి పుట్టాలి అని అనేవాడు. కానీ అపర్ణకి పాప పుట్టడంతో తన మనసులో బాధ పడుతూనే తన భార్యపై కోపాన్ని ప్రదర్శించేవాడు.
ఈ కోప కాస్త ఎక్కువకావడంతో తన భార్యకి నీళ్లలో యాసిడ్ కలిపి తాగించాడు. అంతేకాకుండా ఇంతకముందు ఒకసారి చంపడానికి ప్రయత్నించాడని అపర్ణ తల్లిదండ్రులు వెల్లడించారు.
అపర్ణ తీవ్ర అవస్థకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు . ఈ విషయంపై నాయుడు ఫై కేసు నమోదు చేసారు.