Chicken Prices: తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
రోజు రోజుకి భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో మరో కొత్త వైరస్ దేశంలోకి వచ్చి ప్రజలను గుబులు పెడుతుంది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రంలో కొన్నివేల సంఖ్యలో పక్షులు చనిపోవడంతో.. వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. ఆ పక్షులు “బర్డ్ ఫ్లూ” అనే వైరస్ తో చనిపోయాయంటూ వైద్యులు తెలియజేశారు. ఈ వైరస్ ఒక పక్షి నుండి ఇంకో పక్షి కి వ్యాప్తి ఇస్తుంది. అలాగే ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాప్తి ఇస్తుందట. ఈ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి అన్ని, ఈ వైరస్ సోకితే బతికే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు.

ఇటీవలే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా బర్డ్ ఫ్లూ తో కొన్ని పక్షులు చనిపోవడంతో..మన తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో చికెన్ 250/- వరకు ధర పలికింది.కానీ నేడు కిలో చికెన్ 100/- నుండి 150/- మాత్రమే ధర పలకడం ఆశ్చర్యకరమైన విషయం. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుందేమోనని చికెను ప్రియులు అభిప్రాయపడుతున్నట్లు కనబడుతోంది. ఇంకా రానున్న కొద్ది రోజుల్లో కిలో చికెన్ 50 నుండి 60 కి ధరలు పడిపోయాయని తెలిసిన ఆశ్చర్య పడనక్కరలేదు