Will Keerthy Score hit this time : ఈసారైనా కీర్తి సురేష్ హిట్ కొడుతుందా ? :-

Will Keerthy Score hit this time : ఏంటో అస్సలు కీర్తి సురేష్ చేసే సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కష్టపడి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ప్లాప్ అవుతున్నాయి. అస్సలు కీర్తి కి ఓటీటీ అచ్చుబాటు రాలేదు. ఓటీటీ లో తాను రిలీజ్ చేసిన సినిమాలు పెంగ్విన్ , మిస్ ఇండియా డిజాస్టర్ అయ్యాయి. రెండు ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఏ.
దీనితర్వాత థియేటర్ లో రిలీజ్ అయినా రంగ్ దె కూడా కీర్తి హిట్ కల నెరవేర్చలేకపోయింది. అయితే ఇప్పుడు కీర్తి ఆశలని ఈ నవంబర్ నెలలో విడుదల కాబోతున్న గుడ్ లక్ శశి మీదనే ఉన్నాయి.
ఈ సినిమా ఎపుడో లాక్ డౌన్ ముందే షూటింగ్ పూర్తయింది. అప్పట్లో ఓటీటీ లోనే విడుదల కాబోతుంది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఓటీటీ లో విడుదల అయ్యిన రెండు సినిమాలు డిజాస్టర్ అనే భావించి రిస్క్ ఎందుకు అనుకోని థియేటర్ రిలీజ్ కోసం ఆగారు ఏమో చిత్రబృందం. ఈ సినిమా టీజర్ , గ్లింప్సె అందరికి నచ్చింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు గారు మరియు ఆది పినిశెట్టి నటిస్తున్నారు.
ఈ సినిమా కూడా ఫిమేల్ సెంట్రిక్ ఏ. ఏదేమైనా మొత్తానికి ఈ సినిమా నవంబర్ 26 న విడుదల అవ్వబోతుంది అని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. చూడాలి మరి ఈసారైనా కీర్తి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొడుతుందో లేదో.