Tollywood news in telugu

Wild Dog trailer : నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ టీజర్ ను విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి…!

Wild Dog trailer

Wild Dog trailer : గతంలో  గోకుల్ చాట్ పేలుడు  ఘటనతో  హైదరాబాద్ నగరాన్ని వణికించిన తీరు ను, అలాగే కొన్ని ఇతర ఉగ్రవాద సంఘటనలను  ఆధారంగా చేసుకొని మనముందుకు రాబోతున్న మూవీ  ‘వైల్డ్ డాగ్’. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్  విజయవర్మ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా  ఈ మూవీ  ట్రైలర్ ఈ రోజు  మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది.

 ఈ సందర్భంగా చిరు షోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, ‘నా సోదరుడు నాగ్ ఇంతకముందులాగే కూల్ గా, ఎనర్జిటిక్ గా కనపడుతున్నాడు’ అంటూ కితాబునిచ్చారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని  తెలిపారు.

 అహిషోర్ సాల్మన్ డైరెక్షన్ లో ఒక  యాక్షన్ మూవీకి ఉండాల్సిన కంటెంట్ వైల్డ్ డాగ్ లో ఉన్నాయని టీజర్ ద్వారా తెలుస్తుంది.  ఈ చిత్రంలో తారాగణం సయామీ ఖేర్, అలీ రెజా, ప్రకాశ్ సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ  మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపొందింది. అదేవిదంగా  నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ‘వైల్డ్ డాగ్’ మూవీని  నిర్మించారు.

నిజానికి ఇంతకముందు ఈ చిత్రాన్ని కరోనా కారణంగా  ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఇపుడు  థియేటర్లలో పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో నిర్మాతలు వారి నిర్ణయాన్ని మార్చుకొని ఇపుడు ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button