wife bites off husband’s tongues : భర్త నాలుకను కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా?
wife bites off husband’s tongue : నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది.. అందులో కొన్ని మంచి విషయాలు ఉంటే మరికొన్ని హత్యలు ఆత్మహత్యలు వంటివి కూడా ఉంటాయి. తాజాగా నెటింట్లి ఒక వార్త హల్ చల్ గా మారింది. అదేంటంటే భార్య భర్త నాలుకను గట్టిగా కొరికేసింది. తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా భర్త ముద్దు పెట్టడానికి ప్రయత్నించడంతో భార్యకు కోపం వచ్చి అతని నాలుకను కొరికేసింది. దీంతో తీవ్ర గాయం నొప్పితో భర్త హాస్పిటల్లో చేరాడు.ఈ ఘటన కర్నూలు జిల్లాలోని తుంగని మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన తారా నాయక్ కర్నూలు జిల్లాకు చెందిన పుష్ప విరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిన తర్వాత నుండి వీరిద్దరూ కర్నూల్ లోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి సంసారం బాగానే సాగుతుందన్న సమయంలో.. గత కొద్దిరోజుల నుండి వీరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇటీవల వారిద్దరూ ఘర్షణ పడగా.. అందులో భర్త భర్య దగ్గరకు వెళ్లి బలవంతంగా ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే కోపం మీద ఉన్న భార్యా అతని నాలుకను కొరికేసింది. దీంతో అతను గాయంతో హాస్పిటల్ కి పరుగులు తీశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.