Why rajinikanth is doing like this ? : ఎందుకు రజిని ఇలా చేస్తున్నారు ?:-

Why rajinikanth is doing like this : సూపర్ స్టార్ రజినీకాంత్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు , తమిళం అని కాదు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల హృదయాలలో అయన స్థాయి మరియు స్థానం ఏ వేరు. ఎవరు ఎం అన్న సూపర్ స్టార్ రజిని నంబర్ 1.
అలాంటి రజిని గారు సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత , త్వరగా సైన్ చేసిన సినిమాలు చేసేయాలని స్టోరీ విన్నారో లేదో తెలియదు కానీ వరుసగా సైన్ చేసిన సినిమాలు చేస్తున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానులకు నిరాశ కలిగిస్తున్నారు.
రోబో 2.0 తర్వాత చేసిన సినిమాలు కాల, కబాలి, దర్బార్ , పేట సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయాయి. అయితే ఇటీవలే విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా దర్శకుడు అయినా శివ తో పెద్దన్న అనే సినిమా తీశారు.
ట్రైలర్ లోనే ఇది అన్న చెల్లెళ్ళ బాండింగ్ మీద సాగె కథ అని అర్ధం అయినప్పటికీ రజిని మీద నమ్మకం తో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లారు. కానీ ఈసారి కూడా రజిని కి తీవ్ర నిరాశే కలిగింది. పెద్దన్న సినిమా రిలీజ్ అయినా రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
అయినా ఇప్పుడు మరొకసారి చేసిన తప్పే రజిని చేయబోతున్నారని చిత్రసీమ లో టాక్ విపరీతంగా నడుస్తుంది. అదేంటంటే పెద్దన్న ప్లాప్ అయినప్పటికీ రజిని మరల శివతోనే చేయబోతున్నారని దీనిపై క్లారిటీ త్వరలో ఇయ్యబబోతున్నట్లు తెలుస్తుంది. ఈవార్త విన్న అభిమానులు ఇది నిజం కాకూడదు అని కోరుకుంటున్నారు.
అయినా రజిని ఎందుకు ఇలా మరల శివతోనే చేస్తున్నారో అర్ధం అవడం లేదు.దానికితోడు రజిని స్క్రిప్ట్ పూర్తిగా విన్నాకనే సైన్ చేయాలనీ అభిమానులు సోషల్ మీడియా లో ట్వీట్స్ రూపం లో వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.