Vande Bharat Express : వందే భారత్ రైళ్లలో ప్రజలు ప్రయాణించడానికి ఎందుకు అనాసక్తి చూపిస్తున్నారు?
Vande Bharat Express : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికులలో ఆదరణ కరువైంది. వందే భారత్ రైల్లో ప్రయాణికులు ప్రయాణించడానికి ఇష్టపడడం లేదు. వందే భారత్ రైలు శిరవేగంగా పరిగెడతాయి… ప్రయాణం చేయడానికి మంచిగా కంఫర్ట్ గా ఉంటుంది. ఆయన ప్రజలు ఇలా అనాసక్తి చూపడానికి కారణాలు ఏమిటి?

ప్రస్తుతం వందే భారత్ రైలు 8 కోచ్ లుగా నడుస్తున్నాయి. వాటిలో ఆక్యుపెన్సి చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.2023 ఏప్రిల్ 1- జూన్ 29(ఇందోర్ – భోపాల్) – కేవలం 21% మాత్రమే బుక్ అయ్యాయి. మళ్లీ రిటర్న్ లో 29% మాత్రమే అయ్యాయి.రాణి కమలాపతి నుండి జబల్పూర్ వరకు 32 శాతం నిండితే.. తిరిగి ప్రయాణానికి 36% బుక్కయ్యాయి. మడగవ్ నుండి శివాజీ టెర్మిస్ వరకు 55 శాతం బుక్కయ్యాయి. ఈ లెక్కన చూస్తే సీట్ల కంటే ప్రయాణికులు తక్కువగానే ఉన్నట్టు అర్థమవుతుంది.టికెట్టు ధరలు ఎక్కువ ఉండడం వల్లే ప్రయాణికులు వందేభారత్లో ప్రయాణించడానికి సముఖత చూపడం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే టికెట్ ధరలు తగ్గించే ప్రయత్నంలో ఉంది.