దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తామో తెలుసా?

deepavali 2020 దీపాలతో భారతీయులు ఆనందోత్సవలలో జరుపుకునే అపురూపమైన పండుగ దీపావళి పండుగ. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఐక్యతకు దీపావళి నిదర్శనం. దీపా అంటే దీపం, ఆవలి అంటే వరుస కాబట్టి ఈ దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. ఈ దీపాలు కమ్ముకున్న కారు చీకటిని చీల్చి చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది
అసలు ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారో… అనేదానికి చాలా కథలు పురాణాలలో ప్రచారంలో ఉన్నాయి.
రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటారన్ని ప్రజల నమ్మకం.
దీపావళి రోజున మరణించిన పితృదేవతలకు స్వర్గ నుంచి భూలోకానికి దిగివస్తారని… వారిని ఆహ్వానించడానికి ఆరుబయట దీపాలు వెలిగిస్తారన్ని కొన్ని పురాణాల్లో ప్రస్తావించారు.
దీపావళి రోజున నేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ప్రజల నమ్ముతుంటారు.