క్రికెట్ ఆటగాళ్లు బబుల్ గమ్ ని ఎందుకు నములుతారో తెలుసా ?

మనం ఏ దేశ క్రికెటర్లు ఏ మ్యాచ్లోనైనా బబుల్ గమ్/ చూయింగ్ గమ్ తింటూ ఉంటారు. కానీ వాళ్లు అలా ఎందుకు తింటారు అనేది మానకు ఏప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది.. ఇలా ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు తినడానికి 4 బలమైన కారణాలు ఉన్నాయి.

- స్టైల్ లుక్ :-
ప్రధానంగా ఈ బాబుల్ గమ్ ని క్రీడాకారులు స్టైల్ లుక్ కోసమే చాలా ఇష్టపడుతారు. చూయింగ్ గమ్ నములుతూ ఉంటే ఒక డైనమిక్ ఆటిట్యూడ్ బాయ్ లాగా కనిపిస్తారని క్రీడాకారులు భావిస్తారు
- గొంతు తడి ఆరిపోకుండా :-
మనిషికి సామాన్యంగా ఎండకు ఉంటే 30 నిమిషాలకె, గంటకి గొంతు తడారిపోయి నీరు తాగాలనిపిస్తుంది. అదేవిధంగా క్రీడాకారులు గంటల తరబడి క్రికెట్ మ్యాచ్ లో ఉన్నప్పుడు గొంతు తడి ఆరిపోకుండా ఉండడానికి కూడా చూయింగ్ గమ్ వేసుకుంటారు.
3.ఒత్తిడి :-
క్రికెట్ మ్యాచ్ లో ఉన్న క్రీడాకారులకు పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు ఏకాగ్రతతో…. స్టేడియంలో ఫీల్డింగ్ చేయాలి. ఎప్పుడు బంతి క్రీడాకారులు దగ్గరికి వస్తుందో తెలీదు. ఎప్పుడు అలర్ట్ గానే ఉండాలి. క్రీడాకారులు ఇవన్నీటి పై దృష్టి సారించడానికి చూయింగ్ గమ్ ని నములుతారు.
4.మైండ్ యాక్టివ్ :-
స్టేడియంలో క్రీడాకారులు ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటేనే …ఆట కూడా రసవత్తరంగా ఉంటుంది..అందుకే క్రీడాకారులు ఎప్పుడు ఉత్సాహంగా ఉండడానికి..చూయింగ్ గమ్ ని నములుతారు.