Today Telugu News Updates
నెట్ ఫ్లిక్స్ ఫ్రీ…నిజాలు చెప్తే ఎవరు నమ్మరు !

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఓ బంపర్ ఆఫర్ సినీ అభిమానులకు అందించనుంది . తమ ఫ్లాట్‌ఫామ్‌లో ఎలాంటి కంటెంట్ ఉందో ప్రజలు చూసి తెలుసుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఇందుకోసం డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు ఎవరైనా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌లోని సినిమాలు, వెబ్ సీరిస్‌లు, ఇతర కార్యక్రమాలను చూసేందుకు వీలు కల్పిస్తున్నామని తెలిపింది .
ఈ డిసెంబర్ 5, 6 తేదీల్లో అభిమానులకు ఇది అందుబాటులో కి రానుంది అని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు తెలిపింది. అంటే 5వ తేదీ రాత్రి 12.01 గంటల నుంచి డిసెంబర్ 6 రాత్రి 11.59 గంటల వరకు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేనివారు కూడా కంటెంట్ మొత్తాన్ని చూడవచ్చు అని తెలిపింది . కంటెంట్ చుసిన తరువాత మా యాప్ ని ఆదరించాలని సంస్థ కోరింది.