ఈ సంక్రాంతికి గెలుపు బాలయ్యదేనా
సంక్రాంతికి ఈ సినిమాల మధ్యన ప్రధాన పోటీ.
సంక్రాంతి అంటేనే తెలుగువారికి ముఖ్యమైన పండగ.ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు స్టార్ హీరోల సినిమాలతో మొదలవుతుంది. ఈసారికి బరిలో పెద్ద స్టార్స్తో పాటు యువ హీరోల సినిమాలు ఉన్నయ్.
సంక్రాంతి హీరో గా పేరున్న హీరో బాలయ్య బాబు సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఆయన ప్రతి సినిమా హిట్ ఇప్పటివరకు . . . ఈసారి ఆయన తన తండ్రి నందమూరి తారకరాముడి బయో పిక్ మొదటి భాగం కథానాయకుడు రిలీజ్ కాబోతుంది. సినిమా మొదలు అయినప్పటి నుండి భారీ అంచనాలు ఉన్నయ్. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా ఉంది.
ఇక పోతే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేటా కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది. రోబో విజయంతో ఉన్న రజనీ ఈ సారికి సంక్రాంతి హీరోగా బరిలో ఉన్నాడు.
ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ కూడా ఈ పండగ వాతవరణంలోనే విడుదల కాబోతుంది. మాస్ ఆడియన్స్ ను అలరించే ఎలిమెంట్స్ ఉన్నాయ్. యూత్ స్టార్ కావడంతో ఈ సినిమాకు కూడా బాగా క్రేజ్ ఏర్పడింది.
వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్ టూ కూడా ఈ పండగకే రిలీజ్. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సినిమా కాబట్టి ఈ సినీమా మీద తగిన అంచనాలు ఉన్నాయ్.
పై నాలుగు సినిమాలు ఎవరికి వారే బలమైన కాన్సెప్ట్లతో తెరకు ఎక్కాయి కాబట్టి దాదాపు అన్ని హిట్ కావాలని కోరుకుందాం.