Who is Dasara Winner : దసరా కానుకగా విడదలైన సినిమాల పరిస్తితి ఏంటి ? :-

Who is Dasara Winner : తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో అర్ధం అవడం లేదు కానీ హీరోలు పోటపోటీగా ఒకేరోజు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాలు హిట్ అయినా సినిమా లవర్స్ తప్ప , సాధారణ ప్రేక్షకులు ఎదో ఒక సినిమానే చూస్తారు. అదికూడా హిట్ టాక్ ఏ దానికి వస్తాదో దానికి.
ఈ మధ్యనే దసరా పండుగ అని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు పెళ్ళి సందడి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అఖిల్ సినిమాకి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అయితే పెళ్ళిసందడి సినిమా యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్ లో మాత్రం సూన్యం లా కనిపిస్తుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలలో ఏ ఒక సినిమా అయినా వేరే తేదీన విడుదల అయ్యింటే రెండు సినిమాలకి మినిమం కలెక్షన్స్ వచ్చేది.
ఇలా ఒకేరోజు సినిమా రిలీజ్ చేయడం వళ్ళ ఎదో ఒక సినిమాకి మాత్రం కచ్చితంగా లాస్ వస్తుంది. అది ఎక్కువ లోన తక్కువ లోన అనేది ఇంకో సినిమాకి వచ్చే రెస్పాన్స్ దాని బట్టి ఉంటుంది.
ఇంకోపక్క శర్వానంద్ మహా సముద్రం సినిమా. ఈ సినిమా దసరా కి ఒక రోజు ముందే విడుదల అయింది.కాబ్బటి ఈ సినిమా కి కూడా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో లాస్ కి కొంచెం అటు ఇటు కలెక్షన్స్ చేసి సేఫ్ జోన్ లోనే ఉంది.
అందుకే ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఇలా ఒక రోజు గ్యాప్ ఉన్న కలెక్షన్స్ విషయం లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు . కానీ ఒకేరోజు విడుదల అయితే మాత్రం ఎదో ఒక సినిమాకి ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది అది ఈ దసరా కి విడుదల అయినా సినిమాల ద్వారా సినీ ప్రజలకు మరల గుణపాఠం ఇచ్చింది.
చూడాలి మరి ఇలాగె ఒకేరోజు ఇంకా సినిమాలు రిలీజ్ చేస్తారో లేదా ఒక సినిమా రిలీజ్ కి ఇంకో సినిమా రిలీజ్ కి ఒక రోజు అయినా గ్యాప్ ఇస్తారో చూడాలి.
మొత్తానికి దసరా విన్నర్ గా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా మరియు టాక్ పరంగా. మహా సముద్రం , పెళ్ళి సందడి కంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచేలోర్ ఏ టాప్ లో నిలిచింది.