Only for family

వైట్ హెయిర్ సమస్య తో బాధపడుతున్నారా…అయితే మీ జుట్టుని నల్లబడేలా చేసి, సిల్కి గా ఉంచే చిట్కాలు మీకోసం…!

White hair problem

White hair problem : ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు బాధిస్తున్న సమస్య తెల్లజుట్టు. చాల చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో కొందరు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. ఇక 30 ఏళ్లలోపే తెల్ల జుట్టు వస్తే.. ఇక వారి బాధ వర్ణనాతీతం. వీరు ఎక్కడికి వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య  శరీరంలో మెలనిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడమే . అదేవిదంగా  ఇతర కారణాల వల్ల కూడా వైట్ హెయిర్ బారిన పడుతూ ఉంటారు.  వెనకటి తరం వారి కుటుంబ సబ్యులలో   ఎవరికైనా తెల్ల జుట్టు త్వరగా వస్తే.. జన్యు కారణాల వల్ల  తర్వాతి తరం వారిలోనూ ఈ సమస్య కనబడుతూ ఉంటుంది. అధిక  ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవన విధానాలు కూడా జుట్టు తెల్లబడేందుకు కారణమౌతుంది.

  1. ఉసిరి మరియు మెంతులతో హెయిర్ మాస్క్..

ఎండబెట్టిన ఉసిరి కాయను పొడిగా చేసి అందులో కాస్త మెంతి పొడివేసి, తగినంత నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు కానీ, లేదంటే ఉదయం తల స్నానానికి 40 ని,,ల ముందు జుట్టుకు పట్టించి, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విదంగా చేయడం ద్వారా ఉసిరిలో ఉండే సి విటమిన్ , మెంతులలో ఉండే పోషకాలు జుట్టుకు పట్టి  వెంట్రుకల పెరుగుదలతో పాటుగా తెల్ల జుట్టు రాకుండా అరికడుతుంది.

2. కరివేపాకు మరియు కొబ్బరినూనె మిశ్రమం ద్వారా…

కొద్దిగా కొబ్బరి నూనెను ఒక గిన్నెలో తీసుకొని, అందులో కాస్త కరివేపాకు ఆకులు వేసి అవి నల్లగా మారే వరకు వేడిచేయాలి. ఈ నూనెను వడగట్టి గోరువెచ్చగా ఉన్నపుడే తలకు మర్దన చేయడం ద్వారా కరివేపాకులో ఉండే విటమిన్ బి  తెల్లజుట్టును అరికడుతుంది.

3. బ్లాక్ టీ ద్వారా కూడా తెల్లజుట్టును నల్లబడేలా చేయవచ్చు…

ఒక చిన్న కప్పులో నీటిని తీసుకొని, అందులో సరిపడ బ్లాక్ టీ పొడిని కలపండి. అలాగే ఒక టీ స్పున్ ఉప్పును  కలిపి ఆ నీరు సగం కప్పు వచ్చేంతవరకు మరిగించి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం ద్వారా మీ తెల్ల జుట్టు నల్లబడి తాజాగా మెరుస్తుంది.

4. బాదం నూనె మరియు నిమ్మచెక్క రసం…

బాదం నూనె 2 టీ స్పున్ లు నిమ్మ రసం 3 టీ స్పూన్ లు తీసుకొని వీటిని బాగా కలిపి జుట్టుకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా బాదం లో ఉండే విటమిన్ E , White hair problem జుట్టు మూలాలను రక్షిస్తుంది. జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే నిమ్మరసం లో ఉండే విటమిన్ C  జుట్టు పెరుగుదలతో పాటు సిల్కిగా మార్చుతుంది.

5. గోరింట మరియు కాఫీ పొడి మిశ్రమం …


మన వెంట్రుకలకు నాచురల్ హెన్నా ఈ గోరింట. ఈ గోరింట పొడి షాప్ లలో కూడా లభిస్తుంది. కానీ గోరింట చెట్టు ఆకులు స్వయంగా తెంపి వాడటం ఉత్తమం. ముందుగా కాఫీ పొడిని 2 కప్పుల నీటిలో మరిగించి , చల్లార్చిన తరువాత గోరింట పొడిని వేసి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని గంటలు నానబెట్టి, ఆ తరువాత బాదం నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవనూనె కలిపి జుట్టుకు ఒత్తుగా పట్టించండి. ఒక 45 ని,, లు జుట్టుకు పట్టాక , తేలికపాటి షాంపు తో తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టు కుదుళ్ళు బలంగా మారి, ఊడిపోకుండా అలాగే తెల్లబడకుండా, సిల్కిగా తయారవుతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button