WhatsApp to Stop Working : ఇక వీరు వాట్సాప్ ని మరచిపోవాల్సిందే…షాక్ ఇచ్చిన యాజమాన్యం !

WhatsApp to Stop Working : నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తూ యూజర్లకు వాట్సప్ షాక్ కి గురిచేసింది. కొన్ని పాత వర్షన్ ఫోన్ లలో ఈ జనవరి 1st 2021 నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ రోజు నుండి కొన్ని మిలియన్ల పాత ఫోన్లలో వాట్సప్ మేసేజింగ్ సేవలు కనుమరుగు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న యూజర్లు డిసప్పాయింట్ కు లోనయ్యారు. కానీ ఈ విషయాన్ని వాట్సాప్ ముందుగానే యూజర్లకి తెలియజేసింది.
అయితే, ప్రతి సంవత్సరం పాత ఓఎస్ వెన్షన్ కలిగి ఉన్న మొబైళ్లకు వాట్సప్ సేవలను నిలిపివేస్తూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే చేసింది.
ఇక ఇందులో వాట్సప్ పని చేయని మొబైళ్ల జాబితా వివరాలు తెలుసుకుందాం …..
1. ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్కన్నా పాత వెర్షన్తో కూడిన ఫోన్ లలో వాట్సాప్ ఆగిపోయింది.
2. ఐఓఎస్ 9 (IOS-9) కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్వాడుతున్న వారికి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.
3. ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S) వంటి ఫోన్లలోను వాట్సాప్ పూర్తిగా ఆగిపోయింది.