మీకో విషయం తెలుసా ? ఒక మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్ దొంగను పట్టించింది…

whatsapp Caught thief :: మీకో విషయం తెలుసా ? ఒక మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్ దొంగను పట్టించింది…ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…గత ఏడాది క్రితం జరిగిన దొంగతనానికి …ఇటీవలే ఆ దొంగను వాట్సాప్ స్టేటస్ పోలీసులకు పట్టించింది. అసలు ఈ దొంగతనం ఎక్కడ, ఎప్పుడు,ఎలా జరిగిందో వివరాల్లోకి వెళితే….
రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిపూరి కాలనీకి చెందిన రవి కిరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి 2019 జులై12న తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఈ తీర్థయాత్రలను ముగించుకొని…. ఇంటికి చేరుకోగా …తలుపుకి వేసిన తాళం లేకపోవడంతో మొదట ఖంగుతిన్నారు. ఆ తర్వాత తాళం మర్చిపోయి వేయలేదు కావచ్చని ఇంట్లోకి వెళ్లగా… బట్టలన్నీ చిందరవందరగా, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో తమ బీరువాలో ఉన్న నగల కోసం వెతకగా … అవి లేకపోవడంతో బంగారం చోరీకి గురయ్యాయని కుటుంబ సభ్యులు గ్రహించారు. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాగా… పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
చోరీ జరిగి సంవత్సరం గడుస్తున్న పోలీసులు ఈ కేసును ఛేదించి లేకపోయారు. దీంతో కుటుంబ సభ్యులు నగల పై ఆశలు వదులుకున్నారు…కానీ ఇటీవలే ఇంటి పొరుగున ఉన్న ఓ సదరు మహిళ నగలతో అలంకరించుకుని దిగిన ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టగా…. ఆ స్టేటస్ ని రవి వీక్షించారు. ఆ స్టేటస్ లో మహిళ ధరించిన నగలు తమవే అన్ని రవి గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిజానిజాలను ఛేదించారు.
అసలు దొంగతనం చేసింది ఆ మహిళ కొడుకు అని నిజం చెప్పడంతో… పోలీసులు అతన్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. కొడుకు దొంగతనం చేసిన బంగారు నగలను వేసుకునందుకు మహిళకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంవత్సరం క్రితం పోగొట్టుకున్న బంగారు నగలు దొరికాయని కుటుంబ సభ్యులు ఆనంద ఉత్సాహాలలో మునిగితేలారు..వారికి కుటుంబ సభ్యులకు కలిసొచ్చిన మరో విషయం ఏమిటంటే… 2019లో 10 గ్రాముల బంగారు ధర 34,000 రూ. కానీ ప్రస్తుతం ఇప్పుడు బంగారం ధర 52,000..అంటే సుమారు 17,000 రూ.ల లాభం చేకూరుతుంది… బహుశా…అదృష్టం అంటే ఇదేనేమో…