health tips in telugu

మన కళ్ళు, జుట్టు, చర్మం మన ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నాయో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మాములుగా డాక్టర్ ని సంప్రదించి తెలుసుకుంటాము. అలా కాకుండా మన బాడీలోని కొన్ని ఆర్గాన్స్ కూడా మన ఆరోగ్యం గురించి మనల్ని హెచ్చరిస్తాయి అని మీకు తెలుసా? ముఖ్యంగా మన కళ్ళు, చర్మం మరియు జుట్టు మన ఆరోగ్యం గురించి చాలా చెప్తుంటాయి. కాకపొతే వాటిని మనం ఎలా గుర్తించి జాగ్రత్తపడాలి అనేది ముఖ్యం. చర్మంపై బొబ్బలు లేదా మొటిమలు, జుట్టు ఊడడం, తెల్ల జుట్టు, ఎర్రగా ఉన్న కళ్ళు మొదలైన లక్షణాల ద్వారా మన హెల్త్ కండిషన్ ని గుర్తించవచ్చు.

మొదట గుoడె జబ్బులు, కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటు మరియు ఆస్టియోపొరోసిస్ వంటి ఆరోగ్య సమస్యల యొక్క మొదటి కొన్ని లక్షణాలు తరచూ కళ్ళు, చర్మం మరియు జుట్టు మీద వివిధ రకాలుగా కనిపిస్తాయి. ఇప్పుడు మన కళ్ళు, చర్మం మరియు జుట్టు మన ఆరోగ్యం గురించి చెప్పే పది విషయాల గురించిచూద్దాం.

కళ్ళు:

చాలా రకాల ఆరోగ్య పరిస్థితులను మొదట మన కళ్ళ ద్వారా గుర్తించవచ్చు. అందుకే ముందుగా డాక్టర్స్ మన జబ్బుని డయాగ్నోసిస్ చేసే ముందు మన కళ్ళని చెక్ చేస్తారు.

కనుపాప (ఐరిస్) చుట్టూ వైట్ రింగ్స్ ఉంటే అవి అధిక కొలెస్ట్రాల్ ను సూచిస్తాయి.

ఫోన్ లేదా లాప్టాప్ వాడకం తగ్గించడం ద్వారా కనురెప్పల పైన ఉండే స్కిన్ కొట్టుకోవడం తగ్గుతుంది. కానీ ఎక్కువగా కనురెప్పలు కొట్టుకోవడం, కళ్ళ నుండి నీళ్ళు ఎక్కువ సేపు కారుతుండం అనేది నరాల సమస్యను సూచిస్తుంది.

మీ కళ్ళలో రెడ్ స్పాట్స్ ఉంటే అవి అలసట మరియు నిద్ర లేమిని సూచిస్తాయి. కానీ ఈ రెడ్ స్పాట్స్ ముదురు రంగులో ఉంటే డయాబెటిస్ ని సూచిస్తుంది. డయాబెటిస్ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల  రక్త నాళాలు వాయడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. ఈ కండిషన్ ని డయాబెటిక్ రెటినోపతి అని పిలుస్తారు.

రే చీకటి అనేది విటమిన్ A లోపం వల్ల వస్తుంది.

పొగ యొక్క పొడి వాతావరణం వల్ల కళ్ళు డ్రై గా ఉంటాయి. ఈ కండిషన్ థైరాయిడ్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులను సూచిస్తుంది.

కళ్ళలో నొప్పిగా ఉంటే అది ఇన్ఫెక్షన్ లేదా ట్యూమర్ అయ్యి ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయరాదు.

జుట్టు

  1. జుట్టు పెరగడం అధికంగా ఉంటే టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నట్టు సూచిస్తుంది. ఈ కండిషన్ నుండి బయట పడాలంటే చక్కెర తీసుకోవడం తగ్గించుకొని మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి మరొక కారణం పాలీసైస్టిక్ ఒవరీ సిండ్రోమ్ (PCOS).
  2. ఐబ్రోస్ (కనుబొమ్మలు) సన్నబడితే ఆ లక్షణం హైపర్ థైరాయిడిజం -ఇది జుట్టు ఊడడానికి దారితీస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లో ఇంబాలన్స్ కారణంగా కనుబొమ్మలలో ఒక మచ్చలా ఉంటుంది.
  3. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు పలచ్బడం సాధారణంగా సంభవిస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువ అవ్వడం వల్ల దువ్వుకున్నప్పుడు జుట్టు ఊడుతుంది.

స్కిన్

  1. చర్మంపై ముడుతలు పడటం మొదలైతే వయసు మీద పడుతుందని గ్రహించాలి. ఒకవేళ ఈ ముడుతలు ప్రీ-మెనోపాజ్ సమయంలో కనిపించినట్లయితే, ఇది ఆస్టియోపొరోసిస్ (ఎముకల) వ్యాధిని సూచిస్తుంది. సూర్యుకాంతికి గురికాకుండా ఉన్న ప్రాంతాలలో కూడా చర్మం ముడుతలు పడుతున్నట్లయితే అది అధిక రక్తపోటు వల్ల కావచ్చు. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని సూచిస్తుంది.
  2. చర్మంపై ఉన్న దద్దుర్లు లేదా రాషేస్ స్ట్రెస్ కారణంగా సంభవించవచ్చు. స్ట్రెస్ మీ బాడీని కొన్ని ఫుడ్స్ కి రియాక్ట్ అయ్యేలా చూస్తుంది, తద్వారా స్కిన్ పైన దద్దుర్లు మరియు రాషేస్ రూపంలో కనిపిస్తాయి.
  3. బలహీనమైన లేదా పెళుసైన గోర్లు కలిగి ఉంటే అవి శరీరంలో పోషక లోపాలు ఉన్నట్టే. గోర్లు యొక్క ఆకృతిలో ఏవైనా మార్పులు లేదా గోర్లు యొక్క సైడ్స్ కి ఉన్న స్కిన్ ఊడిపోవడం లాంటివి కిడ్నీ లేదా కాలేయ సమస్యలను సూచిస్తాయి.
  4. పెదవులు డ్రై గా ఉంటే అది డీహైడ్రేషన్, రైబోఫ్లావిన్ లోపం లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button