రజనీకాంత్ సమావేశంలో ఏం జరిగింది జరిగింది !

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి . ‘రజనీ మక్కళ్ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సోమవారం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన వస్తుందని అభిమానులంతా ఎదురుచూశారు.
కానీ రాజకీయ ప్రవేశంపై వీలైనంత తొందరగా తన నిర్ణయాన్ని తెలుపుతానని సమావేశం వెల్లడించారు . ఈ సమావేశం రాఘవేంద్ర కల్యాణ మండపంలో జిల్లా కార్యదర్శులతో కీలక అంశాలపై రజనీ సుదీర్ఘంగా చర్చలు జరిపారు . ‘రజనీ మక్కళ్ మండ్రం కార్యదర్శులు, నిర్వాహకులు వారి తరఫు నుంచి లోటుపాట్లు నాకు తెలిపారు. నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నాను అని అన్నారు .
అయితే రజనీకాంత్ జనవరిలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రజనీ పార్టీని స్థాపించిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.