ఆరోగ్యవంతమైన జీవితం కోసం బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటే మంచిది..?
ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం రోజును ప్రారంభించేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం చేస్తుంది. కాబట్టి మనకు ఎక్కువగా మేలు చేసే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి?. ఏఏ అల్పాహారం తింటే మరింత ఆరోగ్యంగా ఉంటాం?. బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి గమనిస్తే..
ఉదయాన్నే లేచిన తర్వాత పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కాస్తంత అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితం అవుతాయి.

మనం రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఆకలి అదుపులో ఉంటుంది.
రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు.. అటుకులు ఓట్ మీల్ వంటివి చక్కని ప్రత్యామ్నాయం.
పీచు తర్వాత మనం రోజు తప్పక తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. ఇందుకోసం రోజూ గుడ్లను తీసుకోవాలి.గుడ్డును అల్పాహారంలో తీసుకోవడం వల్ల అవసరమైన ప్రోటీన్ అందుతుంది.
బాదం వంటి ఎండు పప్పులను కూడా ఉదయం అల్పాహారంలో చేర్చుకోవచ్చు.