Weight Gain Tips Telugu : ఇలా చేస్తే వారంలో బుగ్గలు వచ్చి అందంగా తయారవుతారు..!
Weight Gain Tips in telugu : చాలామంది సన్నగా ఉన్నవారు లావు అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు కెమికల్ పౌడర్ వాడి బొద్దుగా అవుదామని ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఎలాగోలా లావు పెరగాలనుకుంటే ప్రాణాలకు ముప్పే.. అందుకే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా లావు పెరిగే చిట్కా ఒకటి తెలుసుకుందాం… ఆ ఒక్క పౌడర్ ని పాలలో రోజుకు ఒక స్పూన్ తింటే చాలు బొద్దుగా అందంగా తయారవుతారు.

ఆ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1. వేరుశెనగలు/పల్లీలు : వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల త్వరగా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
2. నువ్వులు : వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వులలో ఇనుము ఎక్కువగా ఉంటుంది.
3. జీడిపప్పు : ఇందులో పీచు పదార్థాలు, ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.
4. బాదం : వీటిలో కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో జ్ఞాపక శక్తి పెరుగుదలకు బాదం ఎంతో తోడ్పడుతుంది.
5. బెల్లం : బిల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. దీంతో బెల్లం తిన్న వెంటనే సత్వరమే ఎనర్జీ వస్తుంది.
మొదట పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం పెనం పైన వేంపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సర్ లో పౌడర్ లాగ చేసుకోవాలి. బెల్లంని కూడా పౌడర్ లాగా చేసుకుని.. ఆ రెండిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ వెయిట్ గేన్ పౌడర్ ని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పాలలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగాలి. మళ్లీ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో వేసుకుని తాగాలి. రోజు తాగితే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.