Only for family

LIC Childrens Plan: రానున్న రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు కొరకు మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!

LIC Childrens Plan

LIC Childrens Plan: గత 2 సంవస్త్రాలలో తల్లిదండ్రులలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఇంకా ఈ కరోనా కారణంగా పాలసీలు చేసుకొనే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికోసమని ఈ మధ్యన  పిల్లల భవిష్యత్తుకోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ డబ్బులు వేనేకేస్తున్నారు. కానీ ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్లాన్స్ పిల్లలకోసం ఉన్నవి అనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఎలాంటి వారికోసం మంచి ప్లన్స్ ని తీసుకొస్తుంది. భారత ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌ కార్పొరేషన్‌( LIC) ఒక సరికొత్త ఇన్సూరెన్స్ ‌ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 అదేంటంటే… LIC  తాజాగా ‘న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్’ అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ పాలసీ కేవలం  పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించారు.  పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని డిజైన్ చేసింది.  ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ ఇన్స్యూరెన్స్, సేవింగ్స్ ప్లాన్. ఒక యువ జంటకు పిల్లలు పుట్టిన మరుక్షణమే ఈ పాలసీ తీసుకోవచ్చు.

దీనికి గాను కనీసం ఒక లక్ష రూపాయల  సమ్ ఇన్స్యూర్డ్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. దీనికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల మీద పాలసీని తీసుకునే వెసులుబాటు ను కల్పించారు.  అయితే రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి. ఐదేళ్లు ఉన్న వారికి రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉన్న వారికి రూ.7899 ప్రీమియం, 15 ఏళ్లు ఉన్న వారికి రూ.9202 ప్రీమియం కట్టవలసి ఉంటుంది.

ఇక ఈ LIC కల్పించే ‘ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ’ తీసుకోవాలంటే  వయస్సు 0 ఏళ్లు నుండి 12 సంవత్సరాలు ఉండాలి. ఇక  మెచ్యూరిటీ విషయానికి వస్తే.. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు  పాలసీ గడువు ఉంటుంది. దీనికోసమని  పాలసీ ప్రీమియం చెల్లింపులు ఒక సంవత్సరం, 6 నెలలు, 3 నెలలకోసారి, నెలకోసారి చెల్లించే వెలుసుబాటును కల్పించింది.

 ఈ పాలసీ  మనీ బ్యాక్  విషయానికి వెళ్తే… పిల్లలకు వారి వయసు 18, 20, 22 ఏళ్లు ఉన్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. మూడు వాయిదాల్లో 20 శాతం చొప్పున 60 శాతం మనీ బ్యాక్‌ ని కల్పించారు. ఇక మిగిలిన  40 శాతం మెచ్యూరిటీ తర్వాత బోనస్‌తో కలిపి ముట్టచెప్తారు.  కానీ ఏదైనా కారణాలవల్ల పాలసీదారుడు చనిపోతే, సమ్ అష్యూర్డ్, బోనస్ కలిపి ఇస్తారు.

మరొక వెసులుబాటును LIC  కల్పించింది. అదేంటంటే…  ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకు నచ్చకపోతే.. 15 రోజుల్లోగా పాలసీని వెనక్కి తీసుకునే అవకాశం ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే  పిల్లల పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో చనిపోతే ప్రీమియం ను  మాఫీ చేస్తుంది. ఇక  ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లలకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు పాలసీ కొనసాగేలా చేస్తారు.  మనీ బ్యాక్‌ కూడా లభిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button