Tollywood news in telugu

Vishwak Sen Conceptual Film Title Announced : విశ్వక్ సేన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ :-

Vishwak Sen Conceptual Film Title Announced

Vishwak Sen Conceptual Film Title Announced : విశ్వక్ సేన్ కొత్త కథలను ఎప్పుడు అంగీకరించి , ప్రేక్షకులని తన స్టైల్ లో అలరిస్తూ ఉంటాడు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా విశ్వక్ సేన్ , కొత్త కథతో చేసే ప్రయోగాలు మాత్రం మారవు.

అలాంటి విశ్వక్ ప్రస్తుతం కొత్త సినిమా కి నాంది పలికారు. ఆ సినిమా కూడా చాల కొత్తగా ఉండబోతుందని టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే అర్ధం అయిపోతుంది.

అయితే విశ్వక్ సేన్ కొత్త సినిమా పేరు గామి. ఈ సినిమాకి సంబందించిన వీడియో వదలగా అందరిని ఓ రేంజ్ లో అలరించింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అని అర్ధం అయిపొయింది. విజువల్స్ అయితే అద్భుతం ఒక్క మాటలో చెప్పాలంటే చాల గ్రాండ్ గా ఉంది.

ఈ సినిమాని కొత్త దర్శకుడైన విద్యాధర్ దర్శకత్వం వహించగా , కార్తీక్ శబరీష్ నిర్మించబోతున్నారు. యు.వి. క్రియేషన్స్ , వి సెల్లులాయిడ్స్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగబోతుంది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సరసన చాందిని చౌదరి నటించబోతుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే సినిమా మీద ఎన్నడూ లేనంత హైప్ వచ్చేసింది.

ఈ సినిమాని 2022 లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఈ నెవెర్ బిఫోర్ కథని విశ్వక్ గామి గా ఏ రేంజ్ లో అలరించబోతున్నాడో వేచి చూడక తప్పదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button