telugu gods devotional information in telugu
ఈరోజు మాస శివరాత్రి విశేషాలు
ఈరోజు మార్గశిర కృష్ణ చతుర్దశి దీన్నే మార్గశిర మాస శివరాత్రి అని కూడా అంటారు.
ప్రతినెలా కృష్ణ పక్షంలో త్రయోదశి తో కలిపి ఉన్న చతుర్దశిని మాస శివరాత్రి అంటారు.ఈరోజు శివ ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయ్. ఈరోజు ఆరాధన వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఐశ్వర్య కారకుడు అయిన ఈశ్వరుని వల్ల ధనలాభం చేకూరుతుంది.
మొత్తం మీద శివరాత్రులు అయిదు రకాలు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహా శివరాత్రి. అన్ని శివరాత్రుల్లో మాస శివరాత్రి మహా శివరాత్రులు శివునికి ప్రీతి అయినవి ఈ రోజుల్లో శివాలయము సందర్శన, బిల్వ అర్చన, విభూతి, జల అభిషేకాలు మున్నగునవి చెప్పబడినవి. ఏ అభిషేకాలు చేయలేని వారు నిత్యం నిద్రకు ఉపక్రమించే ముందు పదకొండు సార్లు శివ శివ అనుకున్నా కూడా అది శివరాత్రితో సమం అవుతుంది.
ఓం నమః శివాయ