Vishal Going to do Laati Charge : లాఠీ ఛార్జ్ చేసేందుకు సిద్దమయిన విశాల్. :-

Vishal Going to do Laati Charge : ఏంటి విశాల్ ఏంటి లాఠీ ఛార్జ్ ఏంటి సంబంధమే లేదు అని ఆలోచిస్తున్నారా ? ఉంది విశాల్ కి మరియు అయన చేసే లాఠీ ఛార్జ్ కి కచ్చితంగా సంబంధం ఉంది.
మ్యాటర్ లోకి వెళ్తే విశాల్ తమిళ యాక్టర్ ఏ అయినప్పటికీ తెలుగులో కూడా చాల పాపులారిటీ ఉన్న హీరో అందుకే అయన ఏ సినిమా చేసిన అది తెలుగు లో కూడా డబ్బింగ్ అయి విడుదల అవుతుంది.
అయితే విశాల్ గురించి అందరికి తెలిసిందేగా అయన చేసే సినిమాలలో సమాజానికి ఉపయోగపడే విధంగా కథలతో కమర్షియల్ ఎలెమెంట్స్ జోడు చేసి సినిమాలు చేస్తారు. ఆయన చేసే ప్రతి సినిమా ఒక సామాన్యుడిని ఆలోచింపచేసేలా ఉంటుంది.
అలాంటి విశాల్ ప్రస్తుతం ఎనిమి అనే సినిమా విడుదలకు సిద్ధం చేసారు. ఇదిలా ఉండగా ఇటీవలే విశాల్ 32 వ సినిమాకి సంబందించిన అధికారిక టైటిల్ మరియు వీడియో విడుదల చేసారు చిత్ర బృందం. ఆ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ ఏ లాఠీ.
ఇపుడు అర్ధం అయిందా విశాల్ కి లాఠీ కి ఉన్న సంబంధం. విశాల్ మరల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని విడుదల చేసిన వీడియో లోనే అర్ధం అయింది. అయితే ఈసారి మరల సోషల్ ఎలెమెంట్స్ తో లాఠీ ఛార్జ్ చేయబోతున్నారని తెలిసింది.
విశాల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు ఉన్నాయి కానీ లాఠీ పట్టుకొని లాఠీ ఛార్జ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాని వినోత్ కుమార్ దర్శకత్వం వహించగా , రమణ నంద నిర్మించబోతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది. చూడాలి మరి ఈసారి విశాల్ ఏ సోషల్ ఎలిమెంట్ ని పట్టుకొని లాఠీ ఛార్జ్ చేయబోతున్నారో అని.