Today Telugu News Updates
virushka baby photos: ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన విరుష్క దంపతులు !

virushka baby pics : ప్రముఖ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క ఇండియాలోనే ఎంత ఫేమస్ జంటనో అందరికి తెలిసిన విషయమే, మరి ఇపుడు ఈ జంటకు తోడుగా ఒక చిన్నారి వచ్చింది. అదేనండి విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ) దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించింది.
మరి ఈ చిన్నారిని చూడాలని కోహ్లీ అభిమానులు, అనుష్క అభిమానులు ఎంతగానో ఆతృతగా ఉన్నారు. కానీ వారి ఆశలపై మాత్రం విరుష్క జంట నీళ్లు చల్లారు.
ఈ జంటకు పుట్టిన చిన్నారి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వారి చిన్నారి ఫోటో ను విడుదల చేయాలనే అభిమానులకోరిక తీర్చలేక పోతున్నామని విరుష్క జంట విజ్ఞప్తి చేసింది.