Tollywood news in telugu

Viral Photo Shoot: పెళ్లి జంట ఫొటో షూట్ పై తీవ్ర దుమారం … ఇంతకీ ఏం జరిగిందంటే…!

Viral Photo Shoot

Photo Shoot With Lion : ఈ మధ్యన  ఫొటో షూట్‌ లని, వెడ్డింగ్ ప్రోమో వీడియోస్ కి జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రజలు వారి  పెళ్లి నుండి స్టార్ట్ చేసి.. చిన్న , పెద్ద అని తేడాలేకుండా, వారి  పుట్టిన రోజు వేడుక వరకు  ఫొటో షూట్‌లను నిర్వహిస్తున్నారు.  రెగ్యులర్ గా అందరి లాగే ఫోటోషూట్ చేస్తే..  ఏముంటుంది కిక్కు అనుకున్నారో ఏమో , ఈ జంట ఏకంగా ఒక ప్రమాదకరమైన ప్రాణితో ఫోటోషూట్ చేసుకున్నారు.

సరికొత్తగా.. లాహోర్ లో ఒక పెళ్లైన కొత్తజంట వెడ్డింగ్ షూట్ చేయాలనీ అనుకున్నారు. కానీ అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని , పాపం ఒక చిన్న సింహం పిల్లను పక్కన పెట్టుకొని ఫొటోలకు పోజిచ్చారు. ఈ సింహం పిల్లతో దిగిన ఫోటోలు కాస్త షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలు, వీడియోలు చుసిన నేటి జనాలు మండిపడుతున్నారు. మూగ జీవాలను ఇలా ఫోటోషూట్ ల పేరుతో వాడుకోవడం ఏంటని, అసలు వీటిని ఎవరు అద్దెకిస్తున్నారో తెలుసుకొని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.

అలాగే జంతుప్రేమికులతో పాటుగా.. ‘సేవ్‌ ద వైల్డ్‌’ అనే స్వచ్చంధ సంస్థ కూడా  ఫోటోషూట్ లకి వ్యతిరేకంగా మండిపడ్డారు.  అంతేకాకుండా వన్య ప్రాణుల సంరక్షణ శాఖకు కంప్లెయింట్ కూడా చేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button