Villain Turnover of Madhavan : విలన్ గా మారిపోనున్న మాధవన్:-

Villain Turnover of Madhavan : అవును మీరు విన్నది నిజమే. ఎంతో మంది హృదయాలను దోచుకున్న హీరో మాధవన్. సఖియా అంటూ తాను చేసిన అల్లరి ఇప్పటికి గుర్తుంటుంది. అలాంటి ఎన్నో ప్రేమికుడి పాత్రలు పోషించిన మాధవన్ ఇన్ని సంవత్సరాలు అయినా ముఖ్యమైన పాత్రలు లేదా ప్రెమికుడి పాత్రలే చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో విడుదలైన నిశ్శబ్దం సినిమాలో కూడా అనుష్క కి జోడిగానే చేసారు.
అలాంటి హీరో మొట్టమొదటి సారి విలన్ పాత్రా చేయబోతున్నారు. అదేదో కాదు మన మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకే. చిరంజీవి మలయాళం లో బ్లాక్ బస్టర్ అయినా లూసిఫెర్ రీమేక్ చేయబోతున్నారని తెలిసిందే. ఇటీవలే అయినా పుట్టినరోజు సందర్బంగా ఈ రీమేక్ సినిమా టైటిల్ గా గాడ్ ఫాదర్ అని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో మాధవన్ ఏ బెస్ట్ అని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుసుతుంది. త్వరలో ఈ విషయం కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. చూడాలి మరి మాధవన్ విలన్ గా ఏ రేంజ్ లో అలరించబోతున్నాడో.