Tollywood news in telugu

Villan finalized in RC15 Movie : శంకర్ రాంచరణ్ ప్యాన్ ఇండియా సినిమా లో విలన్ ఫిక్స్ ? :-

Villan finalized in RC15 Movie

Villan finalized in RC15 Movie : మనందరికీ తెలుసు రాంచరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కలిసి దిల్ రాజు నిర్మాణం లో ప్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీస్తున్నారని , ఈ సినిమా ముహూర్తం కూడా ఇదివరకే జరిగింది.

అయితే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రాంచరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వీరిద్దరి మధ్య సాంగ్ తో మొదలుకానుంది అని చిత్రసీమలో టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా శంకర్ సినిమాలలో హీరో కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో , విలన్ కి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది.

పోతే శంకర్ మరియు రాంచరణ్ చేసే సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అని చిత్రబృందం అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ విషయం పైన చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఇండస్ట్రీ అంత ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ ఏ అని హాట్ టాపిక్ గా మారిపోయింది.

శ్రీకాంత్ ఇదివరకే విలన్ గా కెరీర్ ప్రారంభించి మంచి హిట్స్ కొడుతున్నారు , దీనితోపాటు ప్రస్తుతం బాలయ్య బాబుతో అఖండ సినిమాలో నెవెర్ బిఫోర్ విలన్ రోల్ అని శ్రీకాంత్ ఏ చెప్తూ వస్తున్నారు. చూడాలి మరి శ్రీకాంత్ ని రాంచరణ్ , శంకర్ సినిమాలో విలన్ గా పెట్టుకుంటారో లేదా ఇంకా వేరే ఎవరినైనా పెట్టుకుంటారో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button