Vikram New cobra Look: హీరో విక్రమ్ కోబ్రా నయా లుక్ రిలీజ్ … ప్రముఖ పాత్రలో టీమిండియా క్రికెటర్ !

హీరో విక్రమ్ నటిస్తున్న’ కోబ్రా’ సినిమాలోని నయా లుక్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ . ఎపుడు విభిన్న పాత్రల్లో నటించే విక్రమ్ ఇపుడు ఈ సినిమాతో మరొక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నట్లు ఈ లుక్‌తో తెలియవస్తుంది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో సరి కొత్త హెయిర్ స్టైల్‌తో విక్రమ్ కనపడుతున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే ఇందులో కళ్ల జోడు ధరించి , కుడి కన్నులోంచి కొన్ని గణితానికి కి సంబంధించిన అంకెలను చూస్తున్నట్లు పోస్టర్ లో కనబడుతుంది . దీఅదేవిదంగా పోస్టర్ లో ప్రతి సమస్యకూ మ్యాథమెటిక్స్‌లో పరిష్కారం లభిస్తుంది అన్నట్టు క్యాప్షన్ పెట్టారు.
ఇందులో విక్రమ్ 20కి పైగా పాత్రలలో కనపడనున్నట్టు సమాచారం . ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుండగా ,సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నాడు.