vikram: కమలహాసన్ అభిమానులకు గుడ్ న్యూస్ !

కమలహాసన్ కొత్త సినిమా చేస్తున్నాడంటే అభిమానుల్లో పండగ వాతావరణం మొదలవుతుంది, ఎందుకంటే, ఆయన చేసే ప్రతీ సినిమాలో కచ్చితంగా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అలాంటి కథలనే ఆయన ఎంచుకుంటారు. ఈ సందర్బంగా తాజాగా ఆయన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.
ఈ రోజు కమల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పేరును ‘విక్రమ్ ‘ టైటిల్ని ప్రకటించారు. అలాగే చిత్రం టీజర్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. టీజర్ ని బట్టి చూస్తే ఇది యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందుతున్నట్టు కనిపిస్తోంది. కమల్ సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ఇదిఇలాఉంటే శంకర్ దర్శకత్వంలో కమల్ ‘ఇండియన్ 2’ చిత్రాన్ని కూడా చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే, బడ్జెట్ విషయంలో దర్శకుడికి, నిర్మాతకు కొన్ని విభేదాలు రావడం వల్ల ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముందుకు వెళ్లుట లేదు అని తెలుస్తుంది.