Real life stories

నర రూప రాక్షసుడు వికాస్ దుబే నేర చరిత్ర

Vikas dubey crime story

Vikas dubbey Crime Story : ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మానవజాతిని కూడా భూలోకంలోకి వదిలేసాడు. ఆ మానవజాతి సమయానుకూలంగా రకరకాలుగా మారి సృష్టి వినాశానికి దారి తీస్తోంది. నీతిగా బతుకుతూ అందరిలో మంచి పేరు తెచ్చు కోవాలనుకునే వాళ్ళు కొందరు అయితే , ఎన్ని దుర్మార్గాలు చేసయిన సరే బాగా బతికామ లేదా అనే వాళ్ళు మరికొందరు. ఒకసారి మనిషి తప్పుదారిన పడితే తప్పు మీద తప్పు చేస్తాడు తప్పా , ఒప్పా అనే ఆలోచన కుడా రాదు. ఒక గ్రంథంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే.. మిత్రమా నేను సృష్టి ని మాత్రమే నిర్మించాను. మనుషులకి సొంతంగా ఆలోచించే శక్తిని ఇచ్చాను. ఆ శక్తితో మనుషుల్లా బ్రతకండిరా… అంటే మర మనుషుల్లా బ్రతికేస్తూ ఉన్నారు అని.

వికాస్ దుబే ఇతని జీవితచరిత్ర చూస్తే రక్తచరిత్ర 3 వ భాగం తీయవచ్చు. అంత నేరాల పుట్టతో నిండి ఉంది, ఇతని జీవితమంతా దోపిడీలు కిడ్నాపులు బలవంతపు వసూళ్లు హత్యలు కిరాయి హత్యలు దాదాపు 60 కి పైగా కేసులు ఉన్నాయి, జైలులోనే స్కెచ్ వేసి బయట ఉన్నవారిని చంపించేంత సత్తా ఉంది. జైలుకి వెళ్లి రావడం అంటే ఇతనికి ఓ లెక్కే కాదు

ఇతను ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ కి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న బీక్రు గ్రామములో నివసిస్తాడు. కోట లాంటి ఇల్లు చీమ చిటుక్కుమననంత సెక్యూరిటీతో నిండి ఉంటుంది. వికాస్ అనుమతి లేనిదే ఎవరిదయినా ఒక అడుగు కూడా ఇంటి దరిదాపుల్లో కాదు కదా చుట్టుపక్కల్లో కుడా పడదు. అంత జాగ్రత్తతో ఉంటాడు. ఇతను ఉత్తరప్రదేశ్ లో కరుడుగట్టిన రౌడీషీటర్. ఇతని చూస్తేనే సామాన్యుడు గజగజ వణికిపోతాడు.

Vikas dubey house

నేర చరిత్ర

20 సంవత్సరాల క్రితం అంటే 2000 లో పంచాయతీ చైర్మన్ “లల్లన్ వాజ్పేయితో ” జరిగిన గొడవతో నేరాల వైపు మొదటి అడుగు పడింది. అలా అలా నేరాలు చేస్తూ చేస్తూ భూ భకాసురిడిగా మారిపోయాడు. తన చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా అక్రమ భూదందాకు తెరలేపాడు. కబ్జా చేయడం ఆ కబ్జా చేసిన భూముల్ని అమ్ముకోవడం ఇదే అతని వ్యాపారం. ఇలా భూకబ్జాలు చేస్తున్నాడని అతనిమీద ఎన్నో కేసులు నమోదయ్యాయి.ఇలా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అతనికి దొరికిన ఏకైక దారి రాజకీయం. అందుకే గ్రామపంచాయితీ జిల్లాపరిషత్ ఎన్నికలలో ముందుగా తన కుటుంబాన్ని బరిలోకి దింపాడు. అపారమైన విజయం సాధించి అలా గత 15 సంవత్సరాలుగా వికాస్ కుటుంబం రాజకీయాల్లో పై స్థాయిలో ఉంది.

ప్రస్తుతం తల్లి గ్రామ సర్పంచి గాను తమ్ముడు జిల్లాపరిషత్ సభ్యుడిగాను పాలిస్తున్నారు. ఇలా వరుసగా తన ప్రాంతంలో వికాస్ కుటుంబమే ఏకగ్రీవంగా గెలుస్తున్నారంటే అర్థం అయ్యుంటుంది అక్కడ ప్రజల్ని ఎంత భయపెట్టి, రాజకీయం చేసాడో అని. 2002 లో రౌడీ సామ్రాజ్యాన్ని వికాస్ పెద్దగా విస్తరించాడు. తక్కువ సమయంలోనే లెక్కలేనంత డబ్బులు సంపాదించేసాడు. ఆ డబ్బు లో కొంత తన సొంత గ్రామంలో స్కూల్ మరియు కాలేజీ కుడా స్థాపించాడు, ఇదంతా గుడ్ విల్ కోసం ,రాజకీయ లబ్ది కోసం అని వేరే చెప్పనవసరం లేదు.

2000 సంవత్సరంలోనే వికాస్ పేరు మీద మొదటి సివిల్ కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కావడంతో అతని నేర చరిత్ర ఒక్కటొక్కటిగా బయటపడింది.మాములు ఇవ్వలేదని కాన్పూర్ లో “ధరాచంద్ కాలేజీ” ప్రిన్సిపాల్ సీదేశ్వర్ పాండేని అతి దారుణంగా హత్య చేసాడు. అదే సమయంలో జైల్లో ఉండి స్కెచ్ వేసి రాంబాబు అనే రాజకీయ నేతని హత్యా చేయించాడు, 2001 లో బీజేపీ నాయకుడు సంతోష్ శుక్ల హత్యా కేసులో A1 ముద్దాయి. 2004 లో ఓ వ్యాపారిని దారుణంగా చంపేశాడు. వికాస్ దుబేకి తన , మన అనే బేధం ఉండేది కాదు. ఎవరు ఎదిరించిన వారు మటాషే , అది తన బంధువులైన సరే.

ఇన్ని నేరాలు చేసినా జైల్లో చాలా తక్కువ రోజులే ఉన్నాడు. ఎందుకంటే అన్ని పార్టీలలోనూ అతనికి మిత్రులున్నారు. ఎప్పుడయితే ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రౌడీషీటర్లను ఎన్కౌంటర్ చేయమని ఆదేశాలు జారీచేశారు. తనపైన నిఘా పెట్టారనే సమాచారం తో తల దాచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసాడు, యూ.పి, హర్యానా , మధ్య ప్రదేశ్ వరకు ఎక్కడెక్కడో తిరిగాడు , ఫరీదా బాద్ లో పోలీసులకి చిక్కినట్టే చిక్కి తృటిలో ఆటోలో తప్పించుకున్నాడు.

అతనికి లక్నో లో “కిర్ష్ణనాధ్” లో విల్లా ఉంది కానీ పోలీసులు వెతికితే అక్కడ లేడు.

లక్నో లో "కిర్ష్ణనాధ్" లో విల్లా
లక్నో లో “కిర్ష్ణనాధ్” లో విల్లా

కట్ చేస్తే తనని పట్టుకోవడానికి వచ్చిన 8 మంది పోలీసులు తన ఊరికి వచ్చారని తెలుసుకొని 2020 జులై 2న రాత్రి 8 గంటలకి దారుణం గా కాల్పులు జరిపి 8 మంది పోలీసులని హతమార్చాడు, అందులో ఒక డీఎస్పీ కుడా ఉన్నాడు. పోలీసులని చంపేసాక , 21 బృందాలుగా పోలీసులు ఏర్పడి , నిద్రాహారాలు మానేసి అతని కోసం 5 రాష్ట్రాలు, సుమారు 154 గంటలు వెతికారు.

జులై 3 న తన మామని , జులై 5 న తన సహరచరులని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు, ఇక లాభం లేదనుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఉజ్జయిని ఆలయంలో దర్శనం చేసుకొని, ఆలయ సెక్యూరిటీ గార్డ్సు దగ్గరకి వచ్చి నేను వికాస్ దుబే ని పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. జులై 9 2020 న ఉదయం 10 గంటలకి పోలీసులకి స్కెచ్ ప్రకారమే లొంగిపోయాడు. అతనిని ఆలయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ అయి మన కళ్ళముందు టీవీల్లో కనిపించిన విషయం తెలిసిందే .

ఏది ఏమైనా గన్ పట్టుకున్నోడు గన్ కె పోతాడనేది ఈ స్టోరీ కూడా ప్రూవ్ చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button