రివ్యూ: విజయ రాఘవన్ : Vijay Antony Vijaya Raghavan Movie Review

Review: Vijaya Raghavan Movie
Star Cast:- విజయ్ ఆంటోనీ , ఆత్మిక
Producers :- రాజా, సంజయ్ కుమార్
Music Director :- నివస్ కే. ప్రసన్న
Director:- ఆనంద కృష్ణ
కథ :-
ఈ కథ ఐఏఎస్ అవ్వాలని కలలు కనే విజయ రాఘవన్ ( విజయ్ ఆంటోనీ ) గురించి చూపిస్తూ మొదలవుతుంది. తాను కనే కల నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇదే సమయం లో పిల్లలకి పాఠాలు కూడా చెప్తారు. కానీ కొని అనుకోని సంఘటనలు అతని ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వకుండా అడ్డుపడుతుంటాయి. దానికి తోడు విజయ రాఘవన్ ఉన్న స్లం ఏరియా లో చెడ్డవారు ఎందరో ఉన్నారు. వీటన్నిటి మధ్య విజయ రాఘవన్ ఐఏఎస్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు ? స్లం ఏరియా లో తాను ఎదురుకున్న సమస్యలనుంచి ఎలా బయటపడ్డాడు ? ఇంతకీ విజయ రాఘవన్ ఐఏఎస్ అయ్యారా లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
👍🏻:-
- విజయ్ ఆంటోనీ ఎప్పటిలాగే తనదైన మార్క్ నటనతో ప్రజలని అలరిస్తాయి. సినిమా అంతా తన భుజాల పైన వేసుకొని నడిపించారు.
- దర్శకుడు కథ బాగా రాసుకున్నారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఫస్ట్ హాఫ్.
👎🏻:-
- సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ పెట్టారు.
- ఎడిటింగ్ బాలేదు. చాలా సీన్స్ ట్రిమ్ చేయచ్చు.
ముగింపు :-
మొత్తానికి విజయ రాఘవన్ అనే సినిమా అని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో చాలా అనవసరపు సన్నివేశాలు ఉండటం తో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని హిట్ తో సరిపెట్టుకునేలా చేస్తుంది. విజయ్ ఆంటోనీ తన మార్క్ నటనతో సినిమా మొత్తని నడిపించి ప్రేక్షకులని మెప్పిస్తారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్లం ఏరియా కాన్సెప్ట్ చాల బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా బాగా పండించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ గా ఉంటుంది. అదే ఫ్లో సెకండ్ హాఫ్ లో పెట్టింటే బాగుండు అనిపిస్తది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి విజయ రాఘవన్ అనే సినిమా ల్యాగ్ ఉన్న సెకండ్ హాఫ్ ని భరించి చుస్తే మిమల్ని కచ్చితంగా నచ్చుతుంది.
Rating:- 2.75 /5