Vijay Devarakonda Liger Movie : విజయ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది… !

Vijay Devarakonda Liger Movie : పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన , విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తుంది.
ఈ సినిమాకి సంబంధించి గురువారం మూవీమేకర్స్ సర్ప్రైజ్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని తెలిపారు.
సినిమా యొక్క రిలీజ్ డేట్తోపాటు మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ కూడా ఎంతో అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు బారి గా పెరుగుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు ఈ విషయంలో ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు.
అదేవిదంగా ఈ సినిమా యొక్క కథాంశం యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కు సిద్దమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటె ఈ చిత్రం త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.