Gossips

Vijay to Replace Bunny in Aarya franchise : ఆర్య 3 లో హీరో అల్లుఅర్జున్ కాదంట ?:-

Vijay to Replace Bunny in Aarya franchise

Vijay to Replace Bunny in Aarya franchise : ఇటీవలే సోషల్ మీడియా లో సుకుమార్ గారు లైవ్ లోకి వచ్చి తన అభిమానులతో సరదాగా కాసేపు మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే. ఆ ముచ్చట్లలోనే బయటపడిన విషయం ఆర్య 3. సుకుమార్ గారే స్వయానా ఆర్య 3 చేయబోతున్నము దీని పై త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పకనే చెప్పారు.

అప్పటినుంచి ఇప్పటిదాకా ఆర్య 3 సినిమా గురించి , ఈసారి సుకుమార్ మరియు బన్నీ కలిసి ఏ రేంజ్ లో హుంగామ చేయబోతున్నారో అని ఫ్యాన్స్ మరియు ఆర్య ఫ్రాంచైస్ అభిమానులు ఎంతగానో ఊహించుకున్నారు.

అయితే ఇపుడు ఇండస్ట్రీ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఆర్య 3 లో హీరోగా బన్నీ కాదు అని ఇండస్ట్రీ అంత చర్చల సాగాయి.

మ్యాటర్ లోకి వెళ్తే సుకుమార్ ఆర్య ఫ్రాంచైస్ లో వచ్చే మూడవభాగంలో హీరోగా విజయ్ దేవరకొండ అని చిత్రసీమలో టాక్ విపరీతంగా నడుస్తుంది. కానీ ఆర్య సిరీస్ హిట్ అయిందంటే దాని వెనకాల కారణం బన్నీ నటన , డాన్స్ . ఇపుడు మూడవభాగంలో బన్నీ కాకుండా విజయ్ దేవరకొండ ని ఎందుకు తీసుకుంటున్నారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నల మారింది.

కాకపోతే ఈ వార్త నిజం అయితే బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారు అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బన్నీ బదులు ఆర్య 3 లో విజయ్ దేవరకొండ ఫిక్స్ అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త మారుమ్రోగిపోవడం తో అభిమానులలో టెన్షన్ మొదలైంది.

చూడాలి మరి నిజంగానే బన్నీ బదులు విజయ్ దేవరకొండ ని తీసుకుంటున్నారో లేదా ఇవన్నీ పుకార్లని చిత్రబృందం కొట్టి పడేసి బన్నీ తోనే ఆర్య 3 ఉండబోతుందని చెప్తారో వేచి చూడక తప్పదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button