ఇంతకీ విజయ్ మాల్యా చేసింది మోసమేనా !

vijay maalya failure storyవిజయ్ మాల్యా అనగానే గుర్తొచ్చేది RCB (రాయల్ ఛాలంజెర్స్ బెంగళూర్ ), IPL లో దీపికా పదుకొనేతో బ్రాండ్ అంబాసిటర్ గా పెట్టుకొని అందమైన అమ్మాయిలతో స్టేడియం బాల్కనీ లో ఉన్నట్టే మనకి గుర్తు , కానీ ఇతని బిజినెస్ ప్రపంచంలో రారాజు గా ఏలాడు , ఎంతో మంది కి ఎంప్లాయిమెంట్ ఇచ్చాడు , ఆల్కహాల్ Kingfisher బ్రాండ్ ఇప్పటికి మంచి బిజినెస్ చేస్తూనే ఉంది ఇది కొందరికి తెలిసిన విజయ్ మాల్యా .
అసలు తాను ఎలా కెరీర్ స్టార్ట్ చేసాడో చూద్దాం(vijay maalya Career)
1983లో యునైటెడ్ బెవరేజ్ కంపెనీ లో జాయిన్ అయ్యాడు అనతి కాలంలోనే తాను ఓనర్ గా ఎదిగి ఎన్నో కంపిటీటర్ కంపెనీస్ ని కొని విలీనం చేసుకున్నాడు 1999 వచ్చేవరకు “యునైటెడ్ బెవరేజ్” కంపెనీ వాటా 64% కి పెంచాడు , ఒక ఆల్కహాలిక్ కంపెనీ మాత్రమే కాదు ఫుడ్ కంపెనీస్ , ఎలక్ట్రానిక్ కంపెనీస్, మ్యాగజైన్స్ కుడా నడిపాడు , అలా 2005 వారికి తాను చేసే బిజినెస్ లకి తిరుగే లేదు .
కానీ 2005 లో ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు అదే “కింగ్ ఫిషర్” ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయటం, అప్పట్లో తక్కువ ఖర్చు ఎక్కువ సౌకర్యం తో “కింగ్ ఫిషర్” మంచి పేరు తెచ్చుకుంది , అనతి కాలంలోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కుడా నడపటం స్టార్ట్ చేశారు , అయితే ఇదంతా బాగానే ఉంది .
కానీ ఇంకో వైపు ఎంత మంచి పేరు ఉన్న , ప్రతి సంవత్సరం లాసెస్ వస్తూనే ఉన్నాయి , కానీ అలానే నమ్మకం పెట్టుకొని ముందుకు సాగాడు , అలా 2005 లో 341cr నష్టం , 2007 లో 706cr నష్టం , 2013 లో 213cr నష్టం, అంత నష్టాల్లో కుడా 2008 లో నష్టాల్లో ఉన్న మరో విమానయాన సంస్థ డెక్కన్ ఎయిర్లైన్స్ ని “కింగ్ ఫిషర్” లో విలీనం చేసాడు.
అప్పుడు విమానాల సంఖ్య పెరిగింది కానీ నష్టాలు అలానే కొనసాగుతూనే ఉన్నాయి , అప్పటినుండి బ్యాంకులలో అప్పులు చేయటం మొదలు పెట్టాడు , మల్లి 2009 లో 1371 కోట్ల నష్టం , 2010 లో 1290 కోట్ల నష్టం , 2011 లో 1236 కోట్ల నష్టం , ఆ నష్టాన్ని పూడ్చడాని SBI లో అప్పులు చేస్తూనే ఉన్నాడు , విజయ్ మాల్యా ఎప్పటికైనా చెల్లిస్తాడనే నమ్మకం తో తన “కింగ్ ఫిషర్” ఎయిర్లైన్ పైన ఉన్న గుడ్ విల్ తో అప్పులు ఇచ్చారు , కానీ ఆలా నష్టాల్లో నడవటం తో 2014 వచ్చేసరికి పూర్తిగా మూత పడే సమయం వచ్చింది .
అలా 2016 వచ్చేసరికి 9000 కోట్ల వడ్డీ వేరు వేరు బ్యాంకుల వద్ద చేసేసరికి , వాళ్ళు చివరకి చెల్లించాలని నోటీసులు పంపించారు , నోటీసులు పంపించే 6 రోజుల ముందే దేశం వదిలి లండన్ కి వెళ్ళిపోయాడు . అప్పటినుండి మన గవర్నమెంట్ “విజయ్ మాల్యాని” ఎలాగైనా రప్పించేలా ప్రయత్నాలు చేస్తుంది , కానీ విజయ్ మాల్యా మాత్రం తన మీద ఉండే కేసుల్ని లండన్ నుండే సాల్వ్ చేయాలని భావిస్తున్నాడు .
ఎందుకంటే మన “లా” వ్యవస్థ పట్ల తనకి నమ్మకం లేదని న్యాయం జరిగే వారికి పుణ్యకాలం గడుస్తుందని , ఐనా గోవేర్నమేంట్ నన్ను దొంగగా ఎందుకు చిత్రీకరిస్తుందో అర్ధం కావట్లేదని నేను 30 ఏళ్ళు గా బిజినెస్ చేస్తూ ఎన్నో వేల కోట్లు టాక్స్ రూపంలో కట్టానని , కానీ నేను జెన్యూన్ గా బిజినెస్ చేసి లాస్ లో పడిపోయానని ఐన కుడా నన్ను గవెర్నమేంట్ నన్ను సపోర్ట్ ఇవ్వకపోగా దొంగ లా చిత్రీకరించిందని , ఇలా వేరే దేశాల్లో అయితే గవర్నమెంట్ సహాయం తో ఎన్నో కంపెనీలు మల్లి లాభాల బాట పట్టాయని , ఐన పర్వాలేదు నేను తీసుకున్న 6000కోట్ల ప్రిన్సిపుల్ అమౌంట్ ని తిరిగి ఇచ్చేస్తా కానీ దాని వడ్డీ 3000కోట్లు కట్టలేనని , ఇంకా ఎంప్లాయిస్ కి ఇచ్చే 300 కోట్లు కుడా ఇచ్చేస్తా అని చెప్పాడు.
నా పైన కేసులన్నీ విత్ డ్రా చేసుకోండి , ఇండియాకి వస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు , కేసుని సంవత్సరాల పాటు సాగదీస్తారు , అందుకే నేను ఇండియాకి రావట్లేదు అని తెలిపాడు .
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి .