Tollywood news in telugu

నా గ్యాంగ్ తో కలిసి సినిమాకి వెళ్తున్న…ఇంతకీ ఆ సినిమా ఏంటి !

Vijay Devarakonda Tweets

Vijay Devarakonda Tweets  : సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్‌పై విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తన మనసులోని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.  విజయ్ తన గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నా అంటూ షోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేసారు. అలాగే ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మూవీ టీంకు  విజయ్‌ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. 

క్రిస్మస్‌ కానుకగా ప్రజలముందుకు రానున్న  ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్న అని పేర్కొన్నాడు. అదేవిదంగా  డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఆదరించాలని ప్రజలను కోరాడు విజయ్. 

ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పది మిలియన్ల ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకొని  తొలి సౌత్ ఇండియన్‌ యాక్టర్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు.

అయితే తాజాగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌‌ల ఓపెనింగ్‌‌కు అనుమతిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మంగళవారం నుంచే సినిమాలు నడిపించుకోవచ్చని ,అలాగే కోవిడ్ నిబంధనలను ఖచ్చింతంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button