Tollywood news in telugu

ఫైట‌ర్ కోసం స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌


ఫైట‌ర్` కోసం స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`గా క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఫైట‌ర్‌`లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు.
“పూరిగారు తెర‌కెక్కిస్తున్న `ఫైట‌ర్` కోసం ఆలిమ్ హ‌కీమ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌లో చూపించ‌బోతున్నారు. కొత్త లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది“ అంటూ ఛార్మి ట్వీట్ చేశారు. పూరి జ‌గన్నాథ్ ఎంతో కేర్‌తో తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ మేక‌ర్స్‌ను ఫాలో అవుతూ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు.
స‌ల్మాన్‌ఖాన్‌, షాహిద్ క‌పూర్‌, ర‌ణ‌భీర్ క‌పూర్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ స‌హా టాలీవుడ్ స్టార్ అయిన‌ ప్ర‌భాస్‌కు `సాహో`లో, రామ్‌చ‌ర‌ణ్‌కు `ఆర్ ఆర్ ఆర్‌`లో హెయిర్ స్టైలిష్ట్‌గా వ‌ర్క్ చేస్తున్నారు ఆలిమ్ హ‌కీమ్ . పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ క‌లిసి నిర్మిస్తోన్న ఈ చిత్ర నిర్మాణంలో క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌మ‌వుతున్నారు. ముంబైలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button