Tollywood news in telugu

Vijay Devarakonda: లక్కీ ఛాన్స్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ…. !

Vijay Devarakonda

హీరో విజయ దేవరకొండ గతంలో వచ్చిన “అర్జున్ రెడ్డి” మూవీతో మంచి గుర్తింపునందుకున్నాడు.  ఆ తర్వాత  “గీతా గోవిందం”తో మరింత పాపులారిటీ పెరిగింది.  విజయ్‌ ప్రస్తుతం “లైగర్‌. ” సాలా క్రాస్‌ బ్రీడ్”‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారిగా బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తుండగా.. పూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాయొక్క అప్ డేట్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయ్.

అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ “డబూ రత్నాని” క్యాలెండర్‌ షూట్‌లో మొదటిసారిగా విజయ్  పాల్గొన్నాడు .  ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్‌ హీరో, హీరోయిన్లతో” డబూ రత్నాని” కాలెండర్‌ షూట్‌ నిర్వహిస్తారు. ఇందులో ఇప్పటికే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, ఐశ్వర్యరాయ్‌, కియారా అద్వానీ, షారుఖ్‌ ఖాన్‌,  వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్‌ స్టార్స్‌ “డబూ రత్నాని” ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇపుడు తాజాగా ఈ ఏడాది 2021 కాలెండర్‌ షూట్‌లో విజయ్‌ దేవరకొండ షూట్ లో పాల్గొన్నాడు.  ఇందులో అవకాశం చాల అరుదుగా వస్తుంది.  ఇపుడు  విజయ్ అవకాశం దక్కింది.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button