Veyi Subhamulu Kalugu Neeku Movie Review and Rating | హిట్టా ఫట్టా :-
Movie : – Veyi Subhamulu Kalugu Neeku (2022) Review
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Cast: – Vijay Raja, Tamanna Vyas, Shivaji Raja, Satyam Rajesh Cast
Producers: – Srinivasa Rao Jami, Tumu Narasimha Patel
Music Director: – Jnani
Director: – Rathod Rams
Story ( Spoiler Free ):-
ఈ కథ ఒక ప్రముఖ ఛానెల్లో ప్రోగ్రామింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చైతు (విజయ్ రాజా) పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతని తండ్రి నారాయణ (శివాజీరాజా) చివరి కోరిక నెరవేర్చడం కోసం, అతను ఒక బంగ్లాను కొంటాడు. ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది. బంగ్లా లో దెయ్యాలు ఉంటాయి అని చైతు తెలుసుకున్నాక ఎం చేయబోతున్నాడు అనేది మిగిలిన కథ.
ఇప్పుడు చైతూ ఏం చేయబోతున్నాడు? బంగ్లాలో దెయ్యాలు ఎందుకు ఉన్నాయి? వారి ఫ్లాష్ బ్యాక్ కథ ఏమిటి? వీటన్నింటి మధ్య, దివ్య (తమన్నా వ్యాస్) పాత్ర ఏమిటి? చివర్లో ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- విజయ్ రాజ మరియు సత్యం రాజేష్ ఇద్దరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమన్నా వ్యాస్ కూడా తన పాత్ర పరిధిలో బాగా నటించింది.
- కథ చాలా బాగుంది.
- సినిమాటోగ్రఫీ మరియు దెయ్యాల సన్నివేశాలు బాగున్నాయి.
- ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Negatives 👎:-
- బోరింగ్ స్క్రీన్ ప్లే.
- దర్శకుడు మంచి కథను రాసుకున్నప్పటికీ స్క్రీన్‌ప్లేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు.
- సినిమా చాలా వరకు బోరింగ్‌గా ఉండటం తో ప్రేక్షకులను బాగా విసిగిస్తుంది.
Overall :-
విజయ్ రాజా తీసిన వేయి శుభములు కలుగు నీకు సినిమా కథ పరంగా బాగుంది కానీ గ్రిప్పింగ్ కథనం లేకపోవడంతో నిరాశపరిచింది. సత్యం రాజేష్ , విజయ్ రాజా, తమన్నా వ్యాస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎడిటింగ్ వర్క్ బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. దర్శకుడి కథనం సరిగ్గా రాసుకునింటే ఈ సినిమా మంచి విజయం సాధించి ఉండేది. దర్శకుడు కొన్ని సీన్స్‌ని బాగానే హ్యాండిల్ చేసినా మిగిలినవన్నీ చూడటానికి బోరింగ్ గా ఉన్నాయి.
Rating:- 2/5