Venuswamy Adhurs RealLife Story : అదుర్స్ సినిమా స్టోరీ నాదే.. ఆ రెండు క్యారెక్టర్స్ నన్ను చూసే కాపీ కొట్టి తీశారు
Venuswamy Adhurs RealLife Story : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లు పొలిటిషియన్స్ జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఈయన సెన్సేషన్ గా మారుతుంటారు. ముఖ్యంగా ఈయన సమంత నాగచైతన్యలు విడిపోతారంటూ ముందే జోష్యం చెప్పడంతో అప్పటినుంచి ఆయన పాపులర్ అయ్యారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయన చేత పూజలు కూడా చేయించుకుంటారు. ఆయన నుండి కొందరు సలహాలు తీసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు.

అయితే ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి తన లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే అదుర్స్ సినిమా చూడాలని.. ఆ సినిమా స్టోరీ తనను చూసి ఇన్స్పైర్ అయ్యి తీసిందేనని… నరసింహ చారి క్యారెక్టర్ తనదేనని.. అప్పట్లో తాను కూడా పూజలు చేసిన తర్వాత యమహ బైక్ వేసుకొని టీ షర్ట్ ల మీద తిరుగుతూ ఉండేవాణ్ణిని..2003-2004లో తన లైఫ్ జాలీగా సాగుతూ ఉండేదని.. దాదాపు ఇప్పటివరకు తాను 2000 సినిమా ముహూర్తాలు పెట్టి ఉంటానని.. అదుర్స్ సినిమాలో రెండు జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్లు తనను పోలి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి కొందరు ఫన్నీగా నవ్వుకుంటున్నారు.